Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Scholarship 2021:

 Scholarship 2021: విద్యార్థులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు.

Scholarship 2021:


Scholarship 2021  ప్రతిభ ఉన్నా ఆర్థిక కారణాల వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మెడిసిన్, ఇంజనీరింగ్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందొచ్చు ఇలా.


మెడికల్, ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు శుభవార్త. బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. అర్హులైన విద్యార్థులు రూ.20,000 స్కాలర్‌షిప్ పొందొచ్చు. జాతీయ స్థాయ, రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3,00,000 లోపు ఉండాలి. డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి విద్యార్హతల వివరాలు చూస్తే 12వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి. 12వ తరగతి లేదా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.

బడ్డీ 4 స్టడీ ఇండియా అందించే ఈ స్కాలర్‌షిప్‌కు ఇంజనీరింగ్, మెడిసిన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయకూడదు. ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రమే అప్లై చేయాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 12వ తరగతి మార్క్స్ షీట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, దరఖాస్తుదారుల క్యాన్సల్డ్ చెక్ లేదా పాస్‌బుక్ కాపీ ఉండాలి. విద్యార్థుల అకడమిక్ రికార్డ్‌తో పాటు ఆర్థిక అవసరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫైనల్ సెక్షన్‌కు ముందు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.

బడ్డీ 4 స్టడీ ఇండియా నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ సంస్థ. పలు కంపెనీలు, సంస్థలతో కలిసి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Scholarship 2021: "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0