Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SPORTS QUOTA RECRUITMENT - 2020-21

 ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు..

SPORTS QUOTA RECRUITMENT - 2020-21

భారత ప్రభుత్వ సంస్థ ఆదాయపన్ను శాఖలో క్రీడా కోటాలో దేశంలో ప్రతిభావంతుడైన క్రీడాకారులు నుండి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.రాష్ట్రస్థాయి, నేషనల్ స్కూల్ గేమ్స్ లను, ఆల్ ఇండియా యూనివర్సిటీ స్థాయిలోనూ పాల్గొన్నటువంటి ప్రతిభావంతులైన క్రీడాకారులు పోస్టులకు అర్హులు.రాతపరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పిస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 38

పోస్టుల వివరాలు: 

క్యాటగిరి I

1. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్-12

విద్యార్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ/తత్సమాన విద్యార్హత

క్యాటగిరి II

2. టాక్స్ అసిస్టెంట్-16

విద్యార్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ/తత్సమాన విద్యార్హత

క్యాటగిరి III

3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-10.

విద్యార్హతలు : SSC / మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

వయో పరిమితి :

కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు. (01.04.2020 నాటికి )

NOTE : అభ్యర్థులు 01.04.1995 తర్వాత 31.03.2002 కంటే ముందు జన్మించి ఉండాలి.

బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, క్రీడాకారుల విషయంలో 5 సంవత్సరాలు క్రీడాకారులకు ఐదు సంవత్సరాలు వారు సాధించిన విజయాలు ఆధారంగా సడలింపు ఉంటుంది.

క్రీడాంశాలు :

దిగువ తెలిపిన క్రీడాంశాల్లో క్రీడాకారులు రాష్ట్రస్థాయి, నేషనల్ స్కూల్ గేమ్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ పాల్గొని ఉండాలి.

అథ్లెటిక్స్(స్త్రీ, పురుషులు)

పురుషులు: 100, 200, 400, 5000, 10,000 మెట్స్ & హామర్ త్రో. & మహిళలు

మహిళలు: 100, 200, 800 & 1500

బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారం, కాంట్రాక్ట్ బ్రిడ్జి, లాన్ టెన్సిస్, బాడీ బిల్డింగ్.

క్రీడాకారులు 2017, 2018, 2019, 2020 సంవత్సరాలలో గుర్తింపు పొందిన టోర్నమెంట్లో/ఈవెంట్స్ గాని క్రీడాకారులు పోటీ చేసి ప్రతిభ చూపిన ఆధారంగా తీసుకుంటారు

ఎంపిక విధానం : 

ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతోంది. 

1. మొదటి దశ : అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ 

అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబం ధించిన క్రీడలో ప్రస్తుత ప్రదర్శన(ఫాం), సాధించిన విజయాల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. 

2.రెండవ దశ : ఫీల్డ్ ట్రయల్స్‌

దీనిలో అభ్యర్థుల ఫిట్‌నెస్ స్థారుులను చెక్ చేస్తారు. 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఫీల్డ్ ట్రయల్స్‌కు  చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్  

అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది.

దరఖాస్తులకు చివరి తేది : 17.01.2021.

 NOTIFICATION 


APPLY ONLINE 


WEBSITE 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SPORTS QUOTA RECRUITMENT - 2020-21 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0