Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There is no option on corona vaccines ..!

కరోనా టీకాలపై ఆప్షన్‌ లేదు..!

There is no option on corona vaccines ..!

స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ


దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే ఆప్షన్‌ ప్రజలకు ప్రస్తుతానికి ఉండబోదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. అనేక దేశాల్లో ఒకటి కన్నా ఎక్కువ టీకాలు సరఫరా అవుతున్నప్పటికీ ఎక్కడా ప్రజలకు ఇలాంటి ఎంపిక స్వేచ్ఛను ఇవ్వలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్‌ వెల్లడించారు. రెండు డోసులను 28రోజుల వ్యవధిలో తీసుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఇక ఈ రెండు వ్యాక్సిన్‌లు వేల మందిపై పరీక్షించారని, అవి సురక్షితమైనవేనని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ స్పష్టంచేశారు. భారతీయ వ్యాక్సిలన్నీ సురక్షితమని, సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రజలు వాటిని నిస్సంకోచంగా పొందవచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్‌ టీకాలు దేశవ్యాప్తంగా నిర్ధేశించిన ప్రాంతాలకు తరలించగా, కొవాగ్జిన్‌ టీకాల రవాణా ప్రారంభమైంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There is no option on corona vaccines ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0