Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Card Don't like the photo on the aadhaar card? Explanation of how to change.

 Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఎలా మార్చుకోవలో వివరణ.

Aadhaar Card Don't like the photo on the aadhaar card? Explanation of how to change.

Aadhaar Card Photo Update  మీరు మీ ఆధార్ కార్డు ఫోటో మార్చాలనుకుంటున్నారా? ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులోని ఫోటోలపై ఇంటర్నెట్‌లో అనేక జోకుల్ని చూస్తుంటాం. ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా లేదన్న అసంతృప్తి చాలామందిలో ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చినట్టే, ఫోటోను కూడా మార్చేయొచ్చు. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆన్‌లైన్‌లోనే చాలావరకు వివరాలను అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఫోటో, బయోమెట్రిక్ డీటెయిల్స్ మార్చడానికి ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లక తప్పదు. మరి ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో తెలుసుకుందాం.

ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలంటే ముందు స్లాట్ బుక్ చేయాలి. ఆధార్ సెంటర్‌కు వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి డీటెయిల్స్ రాయాలి. ఆ తర్వాత ఆధార్ కేంద్రంలోని ఎగ్జిక్యూటీవ్ మీ లేటెస్ట్ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత మీ బయోమెట్రిక్స్ వివరాలతో అప్రూవ్ చేస్తారు. మీ ఫోటో అప్‌డేట్ చేయడానికి రూ.25+జీఎస్‌టీ చెల్లించాలి. మీ ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒకవేళ పీవీసీ కార్డ్ కావాలంటే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 

మీ ఫోటో అప్‌లోడ్ అయిందో లేదో ట్రాక్ చేసే స్టేటస్ తెలుసుకోవచ్చు. మీకు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. అందులో అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్-URN ఉంటుంది. అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవడానికి https://uidai.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత My Aadhaar సెక్షన్‌లో Update Your Aadhaar లో Check Aadhaar Update Status పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, URN ఎంటర్ చేస్తే ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Aadhaar Card Don't like the photo on the aadhaar card? Explanation of how to change."

  1. I would like to change my photo in aashaa could you please help me sir

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0