Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Adityanath Das, Chief Secretary to Government, concludes a meeting of trade unions

 ఉద్యోగ సంఘాల భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.

Adityanath Das, Chief Secretary to Government, concludes a meeting of trade unions

  • ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు 4 రోజుల్లో పరిష్కారం
  • ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నవి ముఖ్యమంత్రి దృష్టికి...
  • పీఆర్సీ నివేదిక త్వరలో బయటపెడతాం
  • ఏప్రిల్ లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
  • ఉద్యోగ సంఘాల భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
  • ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

మొదట సర్వీసులశాఖ సెక్రటరీశశిభూషణ్ సంఘాల ప్రతినిధులందరినీ పరిచయం చేశారు.

తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. తదుపరి ఉద్యోగ సంఘాల నేతల ప్రశ్నలకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమాధానం ఇచ్చారు. తర్వాత ఆయా సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లు విన్నవించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు తమ సమస్యలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ కు విన్నవించారు.

అందులో ముఖ్యమైనవి 

  • సీపీఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ అందజేయాలని కోరారు.
  • నాలుగో తరగతి ఉద్యోగుల రిటైర్మెంట్ కాలాన్ని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. 
  • డీఎస్సీ ద్వారా తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ప్రతినిధులు కోరారు. 
  • హెల్త్ కార్డులతో నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు.
  • రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక అంశాలతో సంబంధం లేని సమస్యలన్నింటినీ నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రకటించారు.
  • పీఆర్సీ, సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్న అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అవి కాకుండా మిగిలిన సమస్యలను ప్రస్తావించాలని ప్రభుత్వ ప్రతినిధులు సూచించారు. 
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. పీఆర్సీ నివేదికను త్వరలోనే బయట పెడతామన్నారు.
  • ఉద్యోగుల సమస్యల కూలంకషంగా విని పరిష్కరించేందుకు ఏప్రిల్ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
  • ఆర్థిక సంబంధమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మహిళా ఉద్యోగినులకు 5 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని చెప్పారు.
  • ఆర్థికేతర అంశాలు ఏయే శాఖాధికారికి సంబంధం ఉందో వారితో మాట్లాడి నాలుగైదు రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై మరో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
  • సచివాలయంలో గురువారం రాత్రి జరిగిన ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల సమావేశం రాత్రి 9.30 గంటలకు ముగిసింది.
  • ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులతో పాటు ఏపీ ఏన్జీవో సంఘ ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయం సంఘ ప్రతినిధులు వెంకట్రామిరెడ్డి, ప్రసాద్, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.బాబురెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
  • ఉద్యోగుల  ఆర్థికేతర సమస్యలు 4 రోజుల్లో పరిష్కారం  పీఆర్సీ నివేదిక త్వరలో -మహిళా ఉద్యోగినులకు 5 రోజుల ప్రత్యేక సెలవు
  • ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు 4 రోజుల్లో పరిష్కారం
  • ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నవి ముఖ్యమంత్రి దృష్టికి...
  • పీఆర్సీ నివేదిక త్వరలో బయటపెడతాం
  • ఏప్రిల్ లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Adityanath Das, Chief Secretary to Government, concludes a meeting of trade unions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0