Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bad breath? .. Stay away!

 నోటి దుర్వాసనా?..దూరం చేసుకోండి!

Bad breath? .. Stay away!

నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. ఈ నోటి దుర్వాసన మీటింగ్స్‌లో తమ పై అధికారుల నుంచి వస్తుంటే చిన్నవాళ్లకూ ఇబ్బంది. అదే తమ నుంచి వస్తున్నా... ఎదుటివాళ్లు చెప్పడానికి సంకోచించేంత ఇబ్బంది. వెరసి సమస్య ఉన్నవారూ... ఎదుటివారూ ఇలా అందరూ ఇబ్బంది పడే అంశమిది. కానీ నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే అది కేవలం ఓరల్‌ హైజీన్‌ లేకపోవడం వల్లనే కాదు... ఒక్కోసారి ఆ వ్యక్తికే తెలియకుండా తనలో ఉన్న చిగుర్ల జబ్బులూ, డయాబెటిస్, మూత్రపిండాల వ్యాధులు కూడా ఇందుకు కారణమవుతాయి. ఇక తెలిసి వచ్చే దుర్వాసనకు కారణం పొగతాగడం, ఆల్కహాల్‌ వంటివి. వీటిని వదిలేస్తే వెంటనే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఏయే కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుందో...

నోటి దుర్వాసన సమస్యను వైద్యపరిభాషలో 'హాలిటోసిస్‌' అంటారు. చాలామందికి తమ నోటి నుంచి దుర్వాసన వస్తుందన్న విషయం తెలియదు. ఈ విషయంలో కుటుంబసభ్యులే చొరవ తీసుకోవాలి. బయటి వ్యక్తులైతే వారి మొహమాటం వల్ల... లేదా చెప్పాక చెడిపోయే సాంఘిక సంబంధాల వల్ల స్నేహితులు ఇబ్బంది పడవచ్చు. అదే కుటుంబ సభ్యులైతే వారు సున్నితంగా విషయాన్ని తెలియజేయడమే కాకుండా... దుర్వాసన వెలువడుతున్న వారిని డెంటిస్టుల దగ్గరకు లేదా ఫిజీషియన్‌ దగ్గరకు తీసుకెళ్తారు. నోటికి సంబంధించిన అంశాలు... అంటే ఓరల్‌ హైజీన్‌ లేకపోవడం లేదా చిగుర్లకు సంబంధించిన వ్యాధుల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటే దాన్ని డెంటిస్టులు చక్కదిద్దుతారు. అదే... డయాబెటిస్, కిడ్నీ సమస్యల వంటి ఇతర జబ్బుల కారణంగా దుర్వాసన వస్తుంటే... సమస్యను బట్టి దాన్ని ఫిజీషియన్లు పరిష్కరిస్తారు.

నోటి దుర్వాసనకు కారణాలివి... 

 ఇందుకు ప్రధాన కారణాల్లో మొదటిది నోటిలో లాలాజలం తగ్గడం. దీనికి అనేక కారణాలున్నాయి. ఏదైనా తిన్న వెంటనే నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. అలా ఊరని సందర్భాల్లో నోటి నుంచి దుర్వాసన రావచ్చు. చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ లాలాజల స్రావం తగ్గుతుంది. అందుకే వయసు పైబడ్డవారి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. మరికొందరిలోనైతే కట్టుడుపళ్ల వల్ల కూడా దుర్వాసన రావచ్చు ∙స్వీట్లు, నోటికి అంటుకుపోయే చాక్లెట్ల వంటి పదార్థాలను తిన్నప్పుడు... నోటికి అంటుకుపోయినట్లుగా ఉండే ఆ పదార్థాల మీద బ్యాక్టీరియా చేరుతాయి. ఇవెప్పుడూ నోటిలో, గొంతులో ఎక్కువగా ఉంటాయి. వాటినే ఓరో ఫ్యారింజియల్‌ బ్యాక్టీరియా అంటారు. ఈ ఓరో ఫ్యారింజియల్‌ బ్యాక్టీరియా కారణంగానే పొద్దున్నే లేవగానే బ్రష్‌ చేసుకోకముందు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఉదయం మనం బ్రష్‌ చేసుకోగానే వాటి సంఖ్య తగ్గుతుంది. మళ్లీ మనం నిద్రపోయాక పడుకున్న సమయంలో వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతూపోయి పొద్దున్నే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే పొద్దున్నే చక్కగా బ్రష్‌ చేసుకోవడం... నోటిలో పళ్లకు అంటుకుపోయేలాంటి స్వీట్లు చాక్లెట్లు తిన్నప్పుడల్లా చక్కగా నోరు కడుక్కోవడం చేస్తుంటే ఈ తరహా దుర్వాసన అదే తగ్గుతుంది ∙పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నోటి దుర్వాసనను పెంచుతాయి. పొగాకు... దాని ఉత్పత్తుల దుర్వాసనకు నోటిలోని బ్యాక్టీరియా కూడా తోడుకావడం వల్ల చాలా ఎక్కువ దుర్వాసన వస్తుంది. దురలవాట్లకు దూరమైతే నోటి దుర్వాసనా దూరమవుతుంది.

ఇతర ఆరోగ్యసమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన.

 చాలామంది పొద్దున్నే చక్కగా బ్రష్‌ చేసుకుంటున్నా, ఏదైనా తినగానే నోరు శుభ్రంగా కడుక్కుంటున్నా దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటివాళ్లు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అది డయాబెటిస్‌ సమస్య వల్ల కావచ్చు. ఇలాక్కూడా చాలామందిలో డయాబెటిస్‌ ఉన్న విషయం బయటపడుతుంది. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారి రక్తంలో కీటోన్స్‌ అనే కొన్ని రకాల విషపదార్థాలు వెలువడుతుంటాయి. అవి శ్వాస ద్వారా వెలుడినప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

మూత్రపిండాలు రక్తాన్ని వడపోస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రక్తంలోని అమోనియానూ, ఇతర వ్యర్థాలను కిడ్నీలు వడపోయలేనప్పుడు... రక్తంలో చేరుకున్న ఆ వ్యర్థాల కారణంగా నోటి దుర్వాసన రావచ్చు ∙ఒక్కోసారి జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన రావచ్చు. ఈ కండిషన్‌ను 'ఫెటార్‌ హెపాటికస్‌' అంటారు ∙కీళ్లవాతానికి సంబంధించిన జ్వరం (రుమాటిక్‌ ఫీవర్‌) ఉన్నవారిలోనూ నోటి నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది ∙ఊపిరితిత్తుల్లో ఏదైనా గాయం ఏర్పడినా లేదా ఊపిరితిత్తుల్లోకి దారితీసే వాయునాళాల వైశాల్యం ఉండాల్సిన దానికంటే పెరిగినా అదీ నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. ఈ కండిషన్‌ను బ్రాంకియాక్టాసిస్‌ అంటారు ∙హీమోఫీలియా, అప్లాస్టిక్‌ అనీమియా, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం (థ్రాంబోసైటోపీనియా) వంటి రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారి శ్వాస నుంచి కూడా నోటిదుర్వాసన వస్తుంటుంది ∙మనలో స్రవించాల్సిన 'ట్రైమిథైల్‌ అమైన్‌' అనే ఎంజైమ్‌ లోపించడం వల్ల కొందరిలో చేపల నుంచి వచ్చేలాంటి దుర్వాసన వస్తుంటుంది. వాళ్లు మూత్రవిసర్జన చేయగానే ఈ దుర్వాసన వస్తుంది. కొందరిలో చెమట నుంచి కూడా ఈ వాసన వస్తుంటుంది. ఈ కండిషన్‌ను ట్రైమిథైల్‌మెన్యురియా అంటారు. దీన్ని వాడుక భాషలో చేపదుర్వాసనజబ్బు (ఫిష్‌ ఓడర్‌ సిండ్రోమ్‌) అని కూడా అంటారు.

మందుల వల్ల కూడా

 గుండెజబ్బు రాకుండా నివారించే యాంటీ యాంజైనల్‌ డ్రగ్స్‌ వల్ల, మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే డైయూరెటిక్స్‌ వంటి మందుల వల్ల ∙క్యాన్సర్‌ మందుల వల్ల ∙నిద్రమాత్రల వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ తరహా మందులు తీసుకునే వారి నోటిలో లాలాజలం తగ్గి, నోరంతా ఎండిపోయినట్లుగా అవుతుంది. దీన్నే 'జీరోస్టోమియా' అంటారు. మ్యాక్రోగ్లోబ్యులైనిమియా అనే ఒక రకం క్యాన్సర్‌ రోగుల్లో, క్యాన్సర్‌ కోసం తీసుకునే రేడియేషన్‌ థెరపీ వల్ల కూడా నోటి దుర్వాసన కనిపించవచ్చు ∙యంటీబయాటిక్స్‌ వాడటం మొదలుపెట్టినప్పుడు... తొలి మూడు వారాల పాటు నోటి దుర్వాసన రావచ్చు.

నోటి దుర్వాసన నివారణ మార్గాలివి.

∙ఆహారం తీసుకున్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోండి ∙సిగరెట్‌ తాగాక దాదాపు పన్నెండు గంటల పాటు ఆ దుర్వాసన వస్తూనే ఉంటుంది. సిగరెట్‌ లేదా పొగాకు లేదా దాని ఉత్పాదనలు వాడే వారు వెంటనే ఆ దురలవాటను మానేయకపోతే దుర్వాసనను అరికట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు ∙ఉల్లి, వెల్లుల్లి తిన్నప్పుడు చాలాసేపు వరకు నోటి నుంచి దుర్వాసన రావచ్చు. వాటిల్లో ఉండే గంధకం (సల్ఫర్‌) వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి మసాలాలు తిన్నప్పుడు కూడా కొందరి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. బయట చక్కబెట్టే వ్యవహారాలు లేనప్పుడు మాత్రమే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం మంచిది. ఆఫీస్‌లో మీటింగ్, పెద్దలను కలవడం వంటి సందర్భాల్లో ఉల్లి, వెల్లుల్లి, మసాలాలున్న ఆహారానికి దూరంగా ఉండటం మేలు.

అనుమానంతో బాధపడే హాలిటోఫోబియా.

కొందరిలో నోటి దుర్వాసన అనేది కేవలం వారి అనుమానం మాత్రమే నిజానికి వారి నోటి నుంచి ఎలాంటి దుర్వాసనా రాకపోయినప్పటికీ తమకు 'హాలిటోసిస్‌' ఉందని కొందరు నిత్యం అపోహ పడుతుంటారు. ఈ కండిషన్‌ను 'హాలిటోఫోబియా' అంటారు. ఇలాంటి సందర్భాల్లో మానసికి చికిత్స అవసరం. చాలాసందర్భాల్లో నోటి దుర్వాసన అనేది నాలుక మీద ఏర్పడ్డ పాచి వల్ల వస్తుండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నాలుక మీద ఏర్పడే పాచిని తొలచించడం బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటివారు టంగ్‌క్లీనర్‌తో రోజూ టంగ్‌క్లీనింగ్‌ చేసుకోవాలి. .

నోటి దుర్వాసన తొలగించుకోండిలా.

 ఆక్సిజన్‌ అందకపోయినా కొన్ని రకాల బ్యాక్టీరియా నోటిలో పెరుగుతుంటుంది. దీన్నే అనరోబిక్‌ బ్యాక్టిరియా అంటారు. ఈ తరహా సూక్ష్మక్రిములను తగ్గించడానికి ఓరల్‌ స్ప్రేస్‌ అందుబాటులో ఉన్నాయి ∙జింక్‌ ఎక్కువగా ఉండేవి, క్లోరెక్సిడిన్‌తో పాటు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటి కొన్ని రకాల మౌత్‌వాష్‌లు సూక్ష్మక్రిములను నివారిస్తాయి. దాంతో పాటు ఆల్కహాల్‌ మోతాదు ఎక్కువగా ఉండే మౌత్‌ వాష్‌ను వాడటం కూడా మంచి ప్రయోజనాన్నిస్తుంది. వాటిని రోజుకు రెండు / మూడు పూటలా వాడటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది ∙జింక్‌ ఎక్కువగా ఉండే చ్యూయింగ్‌గమ్స్‌ వాడటం కూడా ప్రయోజనాన్నిస్తుంది. 

హాలిటోఫోబియా అనే ఈ తరహా సమస్యను ముందుగా ఫిజీషియన్, సైకియాట్రిస్ట్‌ / సైకాలజిస్ట్‌ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు.

నోటి శుభ్రతకు ప్రత్యామ్నాయాలివి.

 యాలకులు, లవంగాలు వంటి సుగంధ్రద్రవ్యాలు వాడటం ద్వారా ∙నోటి నుంచి మంచి వాసన వచ్చేలా చేసే బ్రిథనాల్‌ వంటి ఉత్పాదన వల్ల ∙చాయ్‌ తేనీరు (టీ) నుంచి సంగ్రహించే కొన్ని స్వభావసిద్ధమైన పదార్థాల వల్ల నోటి దుర్వాసనను తగ్గించవచ్చు కొందరిలో నోటి దుర్వాసన నిజంగా ఓ సమస్య. మరికొందరిలో అది ఒక అపోహ. ఇలా సమస్య ఏదైనప్పటికీ ఒకసారి దంతవైద్యనిపుణులను కలుసుకుంటే సమస్య తీరుతుంది. ఒకవేళ సమస్యకు కారణం... ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అయినట్లయితే అదీ బయటపడటం, దానికి చికిత్స తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన సమస్య తగ్గడమూ జరుగుతుంది.

చికిత్స అవసరమయ్యే సందర్భాలు. 

  •  నోటి దుర్వాసనకు చికిత్స అవసరమయ్యే పరిస్థితులను టీఎన్‌1 నుంచి టీఎన్‌5 అని వర్గీకరించారు. అవి... 
  • కేటగిరీ.... ఏ రకమైన నివారణ / చికిత్స మార్గాలు 
  •  టీఎన్‌ - 1 .... నోటి పరిశుభ్రతను కోసం అనుసరించే స్వీయ మార్గాలు 
  • టీటీఎన్‌ - 2.... చిగుర్ల సమస్యలు రాకుండా ముందుగానే చికిత్స (ప్రొఫిలాక్టిక్‌ ట్రీట్‌మెంట్‌ ఫర్‌ పెరియోడాంటల్‌ డిసీజెస్‌) తీసుకోవడం...
  • టీటీఎన్‌ - 3.... ఫిజీషియన్‌ను కలిసి, వారి సహాయం తీసుకోవడం. 
  • టీటీఎన్‌ - 4.... దుర్వాసనకు కారణాన్ని గుర్తించి, నిపుణుల నుంచి దానికి తగిన వైద్య సహాయం తీసుకోవడం
  • టీటీఎన్‌ - 5 .. ఇది నోటి దుర్వాసన వస్తుందన్న అనుమానం మాత్రమే.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bad breath? .. Stay away!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0