Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Budget 2021-22 meeting concluded .. Budget highlights, complete information is the same.

 ముగిసిన బడ్జెట్ 2021-22 సమావేశం .. బడ్జెట్ ముఖ్యాంశాలు , పూర్తి సమాచారం ఇదే ...

Budget 2021-22 meeting concluded .. Budget highlights, complete information is the same.

బడ్జెట్ టాప్ 10 పాయింట్స్..

  • 1. నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇది 9వ బడ్జెట్ 
  • 2. ఎకానమీ సర్వైవల్ నుంచి రివైవల్ దిశగా ఉండేలా పద్దులు
  • 3. 11ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది 
  • 4.మౌలికం,హెల్త్ కేర్ రంగాలకు అదనంగా 15శాతం కేటాయించే అవకాశం 
  • 5.రానున్న 4 ఏళ్లలో జీడీపీలో నాలుగు శాతం వరకూ హెల్త్ కేర్ కు కేటాయించే అవకాశం. ఇందుకోసం 1శాతం హెల్త్ ట్యాక్స్ అదనంగగా పడే అవకాశం ఉంది. 
  • 6.కార్పొరేట్ సెక్టార్ పన్నుల రాయితీలు కోరుకుంటున్నారు. భారం కూడా తగ్గించాలని వేడుకుంటున్నారు Also Read - 2021 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం 
  • 7.GST రికార్డు స్థాయిలో వసూళ్లు ఉన్న నేపథ్యంలో కొత్త పన్నులు వేయరని సంకేతాలు 
  • 8.గత ఏడాది 2లక్షల కోట్లు డిజిన్విస్టెమెంట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ 10శాతం కూడా చేరుకోలేదు. దీనిపై ప్రధానంగా ద్రుష్టి పెట్టే ఛాన్స్. 
  • 9.బ్యాంకింగ్, మైనింగ్, ఎనర్జీ రంగాల్లో స్టేక్ విక్రయాలకు ప్రాధాన్యం. 
  • 10.వ్యాక్సినేషన్ దేశం మొత్తం ఫ్రీగా ఇస్తారా లేదా అన్నది బడ్జెట్ లో స్పష్టత లేదు.

ధరలు పెరిగేవి

  • ఎలక్ట్రానిక్‌ వస్తువులు
  • మొబైల్‌ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)
  • చెప్పులు
  • పర్సులు
  • చార్జర్స్‌(మొబైల్‌ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు)
  • సింథటిక్‌ జెమ్‌స్టోన్స్‌
  • లెదర్‌ ఉత్పత్తులు
  • సోలార్‌ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు)
  • సోలార్‌ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు)
  • ఆటో విడిభాగాలు
  • స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)
  • కాటన్‌(0 నుంచి 10 శాతం)
  • రా సిల్స్‌, యాన్‌ సిల్క్‌(10 నుంచి 15 శాతానికి పెంపు)
  • ఆల్కహాలిక్‌ బీవెరేజెస్‌
  • క్రూడ్‌ పామాయిల్‌
  • క్రూడ​ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌
  • ఆపిల్స్‌
  • బొగ్గు, లిగ్నైట్‌, పిట్‌
  • యూరియా తదితర ఫర్టిలైజర్లు
  • బఠాణీలు
  • కాబూలీ శనగలు
  • బెంగాల్‌ గ్రాం
  • పప్పులు

ధరలు తగ్గేవి

  • ఐరన్‌
  • స్టీలు
  • నైలాన్‌ దుస్తులు, నైలాన్‌ ఫైబర్‌
  • కాపర్‌ వస్తువులు
  • ఇన్సూరెన్స్‌
  • షూస్‌
  • బంగారం, వెండి ధరలు
  • నాప్తా(హైడ్రోకార్బన్‌ లిక్విడ్‌ మిక్చర్‌)

ఫిబ్రవరి 1 సోమవారం రోజున అంటే నేడు ఉదయం 11 గంటలకు యూనియన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకుని అధికారులతో సమావేశం నిర్వహించారు.

దీని తరువాత రాష్ట్రపతి భవన్ వద్దకు వెళ్లి అక్కడ బడ్జెట్ సమర్పించడానికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి లెడ్జర్‌కు బదులుగా స్వదేశీ టాబ్లెట్ ద్వారా బడ్జెట్‌ను సమర్పించారు.

అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక యాప్ కూడా ప్రారంభించింది, దీని ద్వారా పౌరులు, పార్లమెంటు సభ్యులు బడ్జెట్ పత్రాలను చూడవచ్చు. పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించిన తరువాత ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను క్లిష్ట పరిస్థితుల్లో తయారు చేసినట్లు చెప్పారు.

ఏ రంగానికి ఎంత కేటాయింపు

హెల్త్ కేర్ 2 లక్షల కోట్లు , స్వచ్చ్ భారత 2.0కి లక్ష 41 వేల కోట్లు , విద్యుత్ 3.5 లక్షల కోట్లు , గ్రామీణ మౌలిక సదుపాయాలకి 40 వేల కోట్లు, ఆత్మ నిర్భర్ ఆరోగ్య భారత్ కి 2.23 లక్షల కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 3 వేల కోట్లు, జల్ జీవన్ మిషన్ 2.87 లక్షల కోట్లు, వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు, సౌర శక్తి రంగానికి 1000 కోట్లు, వ్యవసాయ రుణాలకి 16.5 లక్షల కోట్లు, కరోనా వాక్సిన్ కి 35 వేల కోట్లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15,700 కోట్లు, రైల్వే శాఖ లక్ష 10వేల కోట్లు, రక్షణ మంచినీటి పథకాలు 87 వేల కోట్లు

ధరలు

నైలాన్ దుస్తులు, బంగారం, వెండి ధరలు అలాగే కార్ల విడిభాగాల ధరలు మొబైల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.

పన్ను

సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు ఇంకా ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం కానుంది

మరో ఏడాది పొడిగింప: ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు. గృహాలు నిర్మించే సంస్థలకు మరో ఏడాది పాటు పన్ను విరామం కల్పించారు.

బడ్జెట్ అంచనా

2021-22 బడ్జెట్ అంచనా మొత్తం రూ. 34.83 లక్షల కోట్లు.

ద్రవ్యలోటు అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతంగా ఉంది. 2021-2022లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయించారు. ఈ 2 నెలల్లో ఇంకా రూ. 80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది. 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యం.

ఐటీ రిటర్న్స్‌

75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

కోటి మందికి ఉజ్వల పథకం: వంట గ్యాస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కీలక ప్రకటన. ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఉజ్వల పథకం

మరో కోటి మంది లబ్ధిదారులకు అందించనున్నారు. కొత్తగా మరో 100 జిల్లాల్లోని నగరాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం ఏర్పాటు చేయనున్నారు.

750 పాఠశాలలు

స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు, గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Budget 2021-22 meeting concluded .. Budget highlights, complete information is the same."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0