Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lunch is the lifeblood of millions of children.

కోట్లాది మంది పిల్లలకు మధ్యాహ్న భోజనమే జీవనాధారం.

Lunch is the lifeblood of millions of children.

  • పాఠశాలలు తెరిచిన వెంటనే పథకాన్ని పునః ప్రారంభించాలి
  • భారత్ కు WFO పిలుపు

న్యూఢిల్లీ : దేశంలో కోట్లాది మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకం జీవనాధారంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో మూత పడిన పాఠశాలలను పున ప్రారంభించిన వెనువెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తప్పనిసరిగా అమలయాలని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎపి) భారత సంచాలకులు బిసో పరజులి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు ఆధారపడి ఉన్నారని పరజులి తెలిపారు. ఈ పథకం విద్యార్థుల ఆహార భద్రతకు, వారికి పోషకాహారం అందించడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. కోవిడ్ నిబంధనలతో ఈ పథకానికి అంతరాయం కలిగించడం విద్యార్థులపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతుందని ఐరాస అధ్యయనంలో తేలిందని పరజులి తెలిపారు. ముఖ్యంగా బాలికలు పాఠశాలలకు దూరంగా ఉండటం, లేదా మధ్యలోనే చదువు ఆపేయడం వంటివి ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుందని తెలిపారు. లా జోన్ సమయంలో విద్యార్థులు అనుభవించిన పేదరికాన్ని పరిష్కరించడానికి మధ్యాహ్న భోజన పథకం సహాయ పడుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముఖ్యంగా బాలికల్ని పాఠశాలకు తిరిగి పంపించడానికి ఈ పథకం ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. కోవిడ్ -19 నిబంధనలతో గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా మూసివేసిన పాఠశాలలను కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పున ప్రారంభిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lunch is the lifeblood of millions of children."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0