Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Distribute sanitary napkins to students

విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయండి

Distribute sanitary napkins to students

  • బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయండి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో బాల బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయటంతో పాటు విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థినులకు శానిటరీ నాప్ కిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి జ్యోతి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించిన ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు తగిన చొరవ తీసుకోవాల్సిందిగా అడ్వొ కేట్ జనరల్ శ్రీరాంను ఆదేశించింది శానిటరీ నాప్ కిన్స్, మరుగుదొడ్ల సౌక ర్యం లేనందున కూడా డ్రాపవుట్స్ పేరు గుదలకు కారణంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి వివరాలు సమర్పించేందుకు తగిన వ్యవధి ఇవ్వా లని అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. ఇందుకు అంగీకరిస్తూ విచారణను వచ్చేనెల 16కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Distribute sanitary napkins to students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0