Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Javalaga rice is sambar like water

 జావలాగ అన్నం నీళ్లలా సాంబారు

Javalaga rice is sambar like water


ఈ భోజనం ఎలా తింటాం సార్‌

మూడు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి విద్యార్థుల ఆవేదన


 పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని 12 మంది విద్యార్థులు భోజనం ప్లేట్లు, సాంబారు గ్లాసులు పట్టుకుని కిలోమీటరున్నర దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. జావకారుతున్న అన్నం, నీళ్ల లాంటి సాంబారును పోలీసులకు చూపించారు. తమకు ఇటువంటి భోజనం పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా పరిధి కాదు... విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లండని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్దకు వెళ్లారు. ముందుగా తహసీల్దారు కార్యాలయంలోకి వెళ్లగా.. అక్కడి సిబ్బంది వీరిని విద్యా వనరుల కేంద్రానికి పంపారు. ఎంఈవో కె.స్వామినాయక్‌ను కలిసిన విద్యార్థులు... రోజూ నాసిరకం భోజనం పెడుతున్నారని, ఒక్కో రోజు బియ్యంలో రాళ్లు, పురుగులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లేట్లలో వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను ఆయనకు చూపించారు. విద్యార్థులను అక్కడే కూర్చోబెట్టి ఎంఈవో విచారణ చేయించారు. అనంతరం విద్యార్థులకు తోడుగా సీఆర్పీలను ఇచ్చి పాఠశాలకు పంపారు. అందరు విద్యార్థులతో మాట్లాడామని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని వారంతా చెప్పారని ఎంఈవో వెల్లడించారు. విద్యాకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులు పలువురు అధికారుల ఎదుట తమ గోడు వినిపించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Javalaga rice is sambar like water"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0