Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let us know how many types of visas there are and what VISA means.

 వీసాలు ఎన్ని ర‌కాలు ఉంటాయో, VISA అంటే అర్థం ఏమిటో తెలుకుందాం.

Let us know how many types of visas there are and what VISA means.

విదేశాల‌కు వెళ్లాలంటే ఎవ‌రైనా వీసా తీసుకోవాల్సిందే. వీసా లేక‌పోతే ఇత‌ర దేశంలోకి మ‌నం వెళ్ల‌లేం. అయితే భార‌తీయుల‌కు వీసా అవ‌స‌రం లేకుండా కేవ‌లం పాస్‌పోర్టుతోనే వెళ్ల‌గ‌లిగే కొన్ని దేశాలు ఉన్నాయి. అది వేరే సంగ‌తి. కానీ ఇత‌ర ఏ దేశానికైనా వెళ్లాలంటే.. ఆ దేశం మ‌న‌కు ఇచ్చే వీసా క‌చ్చితంగా ఉండి తీరాలి. అయితే ఇంత‌కీ అస‌లు ఈ వీసా గోల ఏంటి..?

వీసా అంటే.. ఒక దేశం త‌మ దేశంలోకి ఇత‌ర దేశాల‌కు చెందిన‌ పౌరుల రాక‌ను అనుమ‌తిస్తూ ఇచ్చే అధికారిక ప‌త్రం అన్నమాట‌. సాధార‌ణంగా వీసాల్లో ప‌లు ర‌కాలు ఉంటాయి. టూరిస్ట్‌, స్టూడెంట్‌, వ‌ర్క్‌, ట్రాన్సిట్ వీసాల‌ని వీసాల్లో ర‌కాలుంటాయి. టూరిస్ట్ అంటే.. ఒక దేశానికి మ‌నం టూర్ వేస్తే కొన్ని రోజుల‌కు గాను వీసా ఇస్తారు. ఆ రోజుల్లో ఆ దేశంలో టూర్ ముగించుకుని వీసా గ‌డువు తీర‌క‌ముందే మ‌న దేశానికి వ‌చ్చేయాలి. ఈ వీసా సాధార‌ణంగా కొన్ని రోజుల నుంచి కొన్ని నెల‌ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. ఇక స్టూడెంట్ వీసా అంటే.. చ‌దువుకునేందుకు ఇత‌ర దేశాల‌కు వెళ్లే విద్యార్థుల‌కు ఆయా దేశాలు ఇచ్చే వీసా అన్న‌మాట‌. సాధార‌ణంగా ఈ వీసా విద్యార్థి చ‌దివే కోర్సు కాల వ్య‌వ‌ధికి అనుగుణంగా ఉంటుంది. అది కొన్ని నెల‌ల నుంచి కొన్ని సంవత్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. అవ‌స‌రం అనుకుంటే మ‌ధ్య‌లో రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక వీసాల్లో వ‌ర్క్ వీసా అని మ‌రొక‌టి ఉంటుంది. విదేశీయుల‌కు ఆయా దేశాలు త‌మ త‌మ దేశాల్లోని కంపెనీల్లో ప‌నిచేసుకునేందుకు అనుమ‌తినిస్తూ మంజూరు చేసే వీసా. ఇది చాలా ఎక్కువ కాల‌మే ఉంటుంది. కంపెనీలు ఇచ్చిన ఉద్యోగం కాంట్రాక్టు గ‌డువు ముగిసే వ‌ర‌కు ఈ వీసాను మంజూరు చేస్తారు. త‌రువాత ఉద్యోగంలో కొన‌సాగితే వీసా రెన్యువ‌ల్ చేసుకోవాలి. లేదంటే సొంత దేశానికి తిరుగు ముఖం ప‌ట్టాలి. ఇక వీసాల్లో ట్రాన్సిట్ వీసా అని మ‌రో వీసా ఉంటుంది. దీన్నే సాధార‌ణంగా ఇత‌ర దేశాల ఎయిర్‌పోర్ట్‌ల‌లో దిగ‌గానే ప్ర‌యాణికుల‌కు ఇస్తారు. ఆ దేశంలో కొన్ని గంట‌ల నుంచి కొన్ని రోజుల వ‌ర‌కు ఉండాల్సి వ‌స్తే ఈ త‌ర‌హా వీసాను మంజూరు చేస్తారు. ఇది ఎయిర్‌పోర్టుల‌లో ఎక్కువ‌గా ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ఏ వీసా అయినా ఆ దేశ నియ‌మాలు, నిబంధ‌న‌ల‌కు  అనుగుణంగానే మంజూరు చేస్తారు. దీంతోపాటు కొన్ని సంద‌ర్భాల్లో అవ‌సరం అయితే వీసా అభ్య‌ర్థుల‌కు మెడికల్ టెస్టుల‌ను కూడా నిర్వ‌హిస్తారు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అస‌లు వీసా ( VISA) పూర్తి రూపం ఏమిటి ? అని ఇంకా మ‌న‌లో చాలా మందికి సందేహం అలాగే ఉంది. అయితే నిజానికి  VISA ప‌దానికి పూర్తి రూపం అంటూ ఏదీ లేదు. కానీ Visitors Intend to Stay Abroad అనే అర్థాన్ని చాలా మంది చెబుతారు. ఇదీ.. వీసా అనే ప‌దానికి పూర్తి రూపం..!


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let us know how many types of visas there are and what VISA means."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0