Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

List of Welfare Schemes in 2021–22 Release of Scheme Implementation Plan Calendar with advance notice of the month in which the benefits of the Welfare Scheme will be provided to the beneficiaries

 2021–22లో సంక్షేమ పథకాల లిస్టు నెల వారిగా సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ పథకాల అమలు ప్రణాళిక క్యాలెండర్‌ను విడుదల

List of Welfare Schemes in 2021–22 Release of Scheme Implementation Plan Calendar with advance notice of the month in which the benefits of the Welfare Scheme will be provided to the beneficiaries


ఒకవైపు కోవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ నవరత్నాల్లోని పథకాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వరుసగా రెండో ఆర్ధిక ఏడాది (2021–22) కూడా నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ పథకాల అమలు ప్రణాళిక క్యాలెండర్‌ను ప్రకటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పథకాన్ని ఏ నెలలో అమలు చేస్తారో ముందుగానే చెప్పి అమలు చేసిన దాఖలాలు లేవు. ముందుగానే నెలలవారీగా ప్రకటించి అమలు చేసి చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.

గత పాలకులకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నెలలోనే 80 శాతం హామీలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు 2020–21లో హామీల ఫలాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేయనున్నారో వెల్లడిస్తూ 2019 ఆగస్టు 27వతేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించడమే కాకుండా అమలు చేశారు. ఇప్పుడు 2021–22లో ఏ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఫలాలను ఏ నెలలో అందించేది మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేశారు. వచ్చే జనవరిలో సామాజిక పెన్షన్లను 2500 రూపాయలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఆర్ధిక ఏడాది అగ్రవర్ణాల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్‌లో అమలు చేయనున్నారు.

ఏప్రిల్‌

  • జగనన్న వసతి దీవెన 1వ విడత
  • జగనన్న విద్యా దీవెన 1వ విడత
  • రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ(2019 రబీ)
  • పొదుపు సంఘాల మహిళలకు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు

మే

  • రైతులకు వైఎస్సార్‌ 
  • ఉచిత పంటల బీమా(2020 ఖరీఫ్‌ )
  • వైఎస్సార్‌ రైతు భరోసా 1వ విడత
  • మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ)
  • మత్స్యకార భరోసా (డీజిల్‌ సబ్సిడీ)

జూన్‌ 

  • వైఎస్సార్‌  చేయూత
  • జగనన్న విద్యా కానుక

జూలై

  • జగనన్న విద్యా దీవెన 2వ విడత
  • వైఎస్సార్‌ కాపు నేస్తం
  • వైఎస్సార్‌  వాహన మిత్ర

ఆగస్టు

  • రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు(2020 ఖరీఫ్‌)
  • ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు
  • వైఎస్సార్‌  నేతన్న నేస్తం
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు

సెప్టెంబర్‌

  • వైఎస్సార్‌ ఆసరా

అక్టోబర్‌

  • వైఎస్సార్‌ రైతు భరోసా 2వ విడత
  • జగనన్న చేదోడు (టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు)
  • జగనన్న తోడు (చిరువ్యాపారులు)

నవంబర్‌

  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

డిసెంబర్‌

  • జగనన్న వసతి దీవెన 2వ విడత
  • జగనన్న విద్యా దీవెన 3వ విడత
  • వైఎస్‌ఆర్‌ లా నేస్తం

జనవరి 2022

  • వైఎస్సార్‌ రైతు భరోసా 3వ విడత
  • జగనన్న అమ్మ ఒడి
  • పెన్షన్‌ పెంపు నెలకు రూ.2500

ఫిబ్రవరి 2022

  • జగనన్న విద్యా దీవెన 4వ విడత

నోట్‌: ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్ద, రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్‌ కానుక మొదలైన పథకాలు అమలవుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "List of Welfare Schemes in 2021–22 Release of Scheme Implementation Plan Calendar with advance notice of the month in which the benefits of the Welfare Scheme will be provided to the beneficiaries"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0