Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PAN Card: Alert .. If not, your PAN card will be canceled .. Rs. 10 thousand fine also .Details

 PAN Card : అలర్ట్ .. ఇలా చేయకపోతే మీ పాన్ కార్డు క్యాన్సిల్ .. రూ . 10 వేల ఫైన్ కూడా .వివరాలు

PAN Card: Alert .. If not, your PAN card will be canceled .. Rs. 10 thousand fine also .Details


మీ ఆధార్​ కార్డుతో పాన్​ కార్డు లింక్​ చేసుకున్నారా?.. లేకపోతే వెంటనే చేసుకోండి. ఆలస్యమైతే జరిమానా కట్టాల్సి వస్తుందని గుర్తించుకోండి. ఎందుకంటే, గతంలో ఆధార్​ కార్డుతో పాన్​ కార్డు అనుసంధానం చేయకపోతే వినియోగదారుడి పాన్​ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలన్నా.. బ్యాంకు ఖాతా తెరవాలన్నా..50 వేలకు పైగా నగదు లావాదేవీలు జరపాలన్నా.. మ్యూచువల్​ ఫండ్స్​ లేదా షేర్లలో పెట్టుబడి పెట్టాలన్నా.. మీ ఆధార్​ కార్డుకు పాన్​కార్డు లింక్​ తప్పనిసరి. ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడానికి 2021 మార్చి 31 వరకు సర్కార్ గడువు విధించింది ఆదాయపు పన్ను శాఖ.

ఈ గడువులోపు అనుసంధానం చేసుకోకపోతే 2021 ఏప్రిల్​ 1 నాటికి మీ పాన్​ కార్డు రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. రద్దైన మీ పాన్​ కార్డుతో భవిష్యత్తులో జరిమానా కట్టాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను విభాగం హెచ్చరించింది. మరో మాటలో చెప్పాలంటే, రద్దైన​ పాన్ కార్డు కలిగి ఉన్న వారిని, పాన్ కార్డు లేని వారిగానే పరిగణిస్తామని, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద వారికి రూ .10,000 జరిమానా విధిస్తామని తెలిపింది.


ఉదాహరణకు, మీరు ఒక బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరవడానికి లేదా రూ .50 వేలకు మించి నగదు జమ/ఉపసంహరించుకోవడానికి మీరు మీ పాన్ నంబర్​ను తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. మీరు రద్దైన లేదా పనిచేయని పాన్ నంబర్​ను పొందుపరిస్తే మీకు రూ .10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అందువల్ల, గడువులోగా మీ పాన్​కార్డును ఆధార్​తో అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ వినియోగదారులను కోరింది. ఒకవేళ ఇప్పటికీ మీరు మీ ఆధార్​తో పాన్​ నంబర్​ను అనుసంధానం చేయకపోతే SMS ద్వారా సులభంగా చేసుకోవచ్చని తెలిపింది.

SMS ద్వారా పాన్ ఆధార్ లింకింగ్ ఎలా చేయాలి?SMS పంపడం ద్వారా సులభంగా మీరు మీ పాన్​, ఆధార్​ కార్డును లింక్​ చేసుకోవచ్చు. దీనికోసం మీ రిజిస్టర్​ మొబైల్​ నంబర్ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేయండి. ఆ తర్వాత స్పేస్​ ఇచ్చి మీ 10 అంకెల పాన్​ కార్డు నెంబర్​ను ఎంటర్​ చేయండి. దీన్ని 567678 లేదా 56161 నంబర్​కు SMS పంపించండి. అంతే, మీ ఆధార్​తో పాన్​ అనుసంధానం పూర్తయినట్లు మీకు సందేశం వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PAN Card: Alert .. If not, your PAN card will be canceled .. Rs. 10 thousand fine also .Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0