Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI Recruitment 2021: Another notification for jobs in RBI ... Details of vacancies

 RBI Recruitment 2021: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు 

RBI Recruitment 2021: Another notification for jobs in RBI ... Details of vacancies

RBI Recruitment 2021 | ఆర్‌బీఐలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ సీఎస్‌జీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, లీగల్ ఆఫీసర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 మార్చి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://opportunities.rbi.org.in/ లేదా https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

RBI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 53

అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)- 12

లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- 11

మేనేజర్ (టెక్నికల్ సివిల్)- 1

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5

RBI Recruitment 2021: విద్యార్హతల వివరాలు 

అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)- హిందీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ. రెండేళ్ల అనుభవం.

లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్. రెండేళ్ల అనుభవం.

మేనేజర్ (టెక్నికల్ సివిల్)- సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్. మూడేళ్ల అనుభవం.

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్ ర్యాంక్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

RBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 23.02.2021 

దరఖాస్తుకు చివరి తేదీ- 10.03.2021

రాతపరీక్ష- 10.04.2021

విద్యార్హతలు- పోస్ట్ గ్రాడ్యుయేషన్

వేతనం- రూ.77,208 వరకు

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ

RBI Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://www.rbi.org.in/  వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత హోమ్ పేజీలో కింది వైపు Opportunities@RBI పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Current Vacancies పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Vacancies పైన క్లిక్ చేయాలి.
  • non CSG రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
  • ఓసారి నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి.
  • ONLINE application పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
  • ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
  • అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RBI Recruitment 2021: Another notification for jobs in RBI ... Details of vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0