Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rs. 2.5 lakh interest tax deduction ..

బడ్జెట్-2021 PFపై ఇక బాదుడే..

Rs. 2.5 lakh interest tax deduction ..

రూ. 2.5 లక్షల మొత్తంపై వడ్డీకే పన్ను మినహాయింపు..

అధిక వేతనం ఉన్న ఉద్యోగులు భవిష్య నిధి (పీఎఫ్‌) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్‌లో కొత్త నిబంధనలను ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ఇకపై రూ.2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది ఏప్రిల్‌ 1, 2021 నుంచి చేసే జమలకే వర్తించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అధిక వేతనాలు తీసుకుంటున్న ఉన్నతోద్యోగుల ఆదాయంపై పన్ను మినహాయింపును హేతుబద్ధీకరణ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.*

ఇక్కడ వడ్డీ ఎక్కువగా రావడంతో...

ఈపీఎఫ్‌ చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద వేతనం (మూలవేతనం, డీఏ)లో 12 శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్‌లో జమ చేయాలి. అంతే మొత్తం యాజమాన్యం తన వాటా కింద చెల్లిస్తుంది. నిర్బంధ చందాకు అదనంగా భవిష్య అవసరాల కోసం స్వచ్ఛంద చందా (వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌- వీపీఎఫ్‌) కింద ఉద్యోగి మూల వేతనానికి మించకుండా జమ చేసుకోవచ్చు. వీపీఎఫ్‌ కింద చెల్లించే మొత్తానికి నిర్బంధ చందాకు లభించే మాదిరే వడ్డీ, పన్నురాయితీ లభిస్తాయి. మిగతా పెట్టుబడుల కన్నా ఇక్కడ వడ్డీ ఎక్కువగా రావడం, వచ్చిన వడ్డీపై పన్ను రాయితీ ఉండటంతో కొందరు ఉద్యోగులు నిబంధనల మేరకు తమ వేతనంలో కొంత మొత్తాన్ని వీపీఎఫ్‌ కింద జమ చేస్తున్నారు. హెచ్చు వేతనం పొందుతున్న వారిలోనూ చాలా మంది ఇదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదాయపన్ను పరిధి రూ.2.5 లక్షలుగా ఉండటంతో, భవిష్యనిధి చందాను తాజాగా ఆ మేరకు పరిమితం చేసినట్లుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.

లెక్క ఇలా...

ఉదాహరణకు ఒక ఉన్నతోద్యోగి భవిష్యత్తు అవసరాల కోసం ఏటా నిర్బంధ, స్వచ్ఛంద చందాతో కలిపి రూ.3 లక్షలు జమ చేస్తున్నారు. అధికవడ్డీ, పన్ను రాయితీ కారణంగా ఈపీఎఫ్‌లో ఆ చందా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చందాపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నూ లేదు. అయితే ఏప్రిల్‌ 1 నుంచి ఏటా ఇదే మొత్తంలో ఉద్యోగి జమచేస్తే, గరిష్ఠ పరిమితి రూ.2.5 లక్షలకు మించి జమ చేసిన రూ.50వేల చందాపై లెక్కించిన వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రైవేటు పీఎఫ్‌ ట్రస్టుల్లోనూ ఉద్యోగి పదవీ విరమణ చేసినా, రాజీనామా చేసినా మూడేళ్ల అనంతరం కూడా పీఎఫ్‌ మొత్తం తీసుకోకుంటే ప్రతినెలా వచ్చే వడ్డీపై ఆదాయ పన్ను వేస్తున్నారు. ఇదే లెక్కన ఉద్యోగి చందా రూ.2.5లక్షలు దాటిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను విధించనున్నట్టు పీఎఫ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rs. 2.5 lakh interest tax deduction .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0