Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A rare honor for a transfer teacher

 బదిలీ ఉపాధ్యాయునికి అరుదైన గౌరవం

A rare honor for a transfer teacher

భుజాలపైకి ఎక్కించుకుని ఊరేగింపు

ఉపాధ్యాయుడిని భుజంపైకి ఎక్కించుకుని ఊరేగించిన మల్లుగూడ గ్రామస్తులు

గుమ్మలక్ష్మీపురం(కురుపాం-విజయనగరం జిల్లా) మారుమూల పల్లెలో దాదాపు పదేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి... తమ పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పిన ఆ ఉపాధ్యా యుడు బదిలీపై వెళ్తున్నారని తెలిసి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ గురువు రుణాన్ని వినూత్నంగా తీర్చుకున్నారు. ఆయన్ను తమ భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిప్పి వీడ్కోలు పలికారు. ఈ సంఘటన గుమ్మ లక్ష్మీపురం మండలం రెల్ల పంచాయతీ మల్లుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలివి. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గౌడు నరేంద్ర అనే ఉపాధ్యాయుడు 2011 జనవరి 12న విధుల్లో చేరారు. రోజూ పాఠశాలకు వెళ్తూ గ్రామంలోని పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పుతూ నిరక్షరాస్యులైన గ్రామస్తులకు అన్ని విధాలుగా సాయప డ్డారు. గ్రామంలోని పాఠశాల భవనం పూర్తిగా శిథిలావ స్థకు చేరుకోగా ఆరేళ్ల క్రితం అధికారులు ఆ భవనాన్ని నేల మట్టం చేశారు. అయినా గ్రామస్తుల ఇంటి గడపల్లోనే తర గతులు నిర్వహించారు. తరువాత గ్రామస్తులంతా కలసి శ్రమదానంతో ఏర్పాటు చేసుకొన్న రేకుల షెడ్ లోనే పాఠాలు బోధించేవారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో నరేం ద్రకు ఇదే మండలంలోని జోగిపురానికి బదిలీ అయింది పదేళ్లుగా గ్రామస్తులతో మమేకమైన నరేంద్రకు ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన గ్రామస్తులంతా ఏకమై ఆయన్ను సోమవారం గ్రామానికి పిలిపించి, భుజాన మోసుకొని చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా డప్పు వాయి ద్యాలతో నృత్యాలు చేస్తూ, గ్రామంలోని వీధులన్నీ తిప్పారు. పాఠశాలలో ఘనంగా సన్మానించారు. విలువైన జ్ఞాపికలను అందించి వీడ్కోలు పలికారు. ఈ సంఘట నతో ఆ ఉపాధ్యాయుడు ఉబ్బి తబ్బిబ్బయ్యారు.






SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A rare honor for a transfer teacher"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0