Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Second wave. The menace peaks in mid-April!

 సెకండ్ వేవ్. పెనుముప్పు ఏప్రిల్ మధ్యలో తారాస్థాయికి!

Second wave.  The menace peaks in mid-April!

  •  దేశంలో కరోనా విజృంభణపై ఎస్బీఐ నివేదిక
  •  రికార్డుస్థాయిలో తాజాగా 50వేలకు పైబడి కేసులు
  •  వేరియంట్లతో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి
  • కోవిషీల్డ్ టీకా ఎగుమతులపై కేంద్రం నిషేధం

 న్యూఢిల్లీ:పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజులు ఉండనుంది. దీంతో రానున్న ఏప్రిల్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది సెకండ్ లో వైరస్ బారిన పడే అవకాశం ఉంది' అని బ్యాంకు నివేదిక ద్వారా అంచనా వేసింది. లాక్ డౌన్, ఆంక్షలు విధించడం వైరస్ వ్యాప్తిపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల వల్ల దేశంలో కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా క్షీణించాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, ఆంక్షలు విధించడంతో మరిన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే సరైన మార్గంలా కనిపిస్తోందని ఎస్బీఐ పేర్కొంది

50 వేలు దాటిన కొత్త కేసులు

 దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంది. రోజువారి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగానమోదవుతు న్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది తొలిసారి రోజువారి కేసులు 50వేల మార్కును చేరుకున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.65 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 53, 476 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది తాజాగా 26,490 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. రికవరీల సంఖ్య 1.12,31,650కు చేరింది. మరోవైపు ఒకేరోజు 251 మంది రోగులు మరణించారు దీంతో ఇప్పటి వరకు రికార్డయిన కొవిడ్ మరణాలు 1,60,692కి చేరాయి మరణాల రేటు 1.37 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యా ప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,95,192కి పెరిగింది. కొవిడ్ పై పోరాటంలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 28.08 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు టీకా తీసుకొన్న వారి సంఖ్య 5,31,45,709కి చేరింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది బుధవారం ఒక్కరోజే 32,855 కేసులు నమోదయ్యాయి ఆర్థిక రాజధాని ముంబై నగరంలోనే 5 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 95 మంది మరణించడగా, 15,098 మంది కోలుకొన్నారు. దేశీయంగా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్నందున, వీలైంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాక్సిన్ల ఎగుమతులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Second wave. The menace peaks in mid-April!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0