Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for the unemployed

నిరుద్యోగులకు శుభవార్త

Good news for the unemployed

  • ఉగాదికి ఉద్యోగుల క్యాలండర్
  • 6 వేల పోలీస్ నియామకాలు అటాన్ మస్ కళాశాలల ప్రశ్న పత్రాలకు నో చాన్స్
  • ఇక అన్ని కళాశాలలకు ఒకే ప్రశ్నాపత్రం
  • వాటి రూపకల్పన, వ్యాల్యుయేషన్ బాధ్యత జేఎన్టీయూకే
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం

ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని ఆదేశించారు. మరోవైపు విద్యారంగంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేసింది. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై సమీక్ష సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని కాలేజీలకీ జేఎన్టీయూ 'తయారుచేసిన ప్రశ్నపత్రాలే ఉండాలని నిర్ణయించారు అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు ఉంటాయి ప్రశ్నపత్రాల వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టంచేశారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని, ఆర్ట్స్ లో మంచి, కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for the unemployed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0