Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bumper: Lakh Electric Two Wheelers for Government Employees

బంపరాఫర్‌: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌

Bumper: Lakh Electric Two Wheelers for Government Employees

 వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది. లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది. తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది.

టూ వీలర్స్ సంస్థలకు రూ.1000 కోట్ల ఆదాయం.

ఆకర్షణీయమైన ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు, బైక్‌లను కొనుగోలు చేసేందుకు అండదండలు కల్పించనున్నది. భారీ స్థాయిలో రాష్ట్రప్రభుత్వోద్యోగులు టూ వీలర్స్ కొనడం వల్ల ఆయా కంపెనీలకు రూ.500-1000 కోట్ల ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫస్ట్‌టైం

భారీ సంఖ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక నియమించిన వలంటీర్లు నాలుగు నుంచి ఐదు లక్షల మంది గ్రామ కార్యదర్శుల్లా పని చేస్తున్నారు.

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు

తక్కువ వడ్డీరేటుపై వారంతా ఈవీ టూవీలర్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టూ వీలర్స్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది.

ఈఈఎస్ఎల్‌తో ఏపీ సర్కార్ జట్టు

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ సర్కార్ జత కట్టింది. భారీగా ఈవీ టూ వీలర్స్‌ను ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నది.

ఆకర్షణీయ వాయిదాల్లో ఇలా టూ వీలర్స్

ఈ పథకం కింద ఈవీ టూ వీలర్స్ పొందిన వారికి తక్కువ వడ్డీరేటుపై ఆకర్షణీయ రుణ వాయిదాల కింద రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాంకర్లతో సంప్రదిస్తున్నది. కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ చర్చిస్తున్నది.

ప్రభుత్వోద్యోగులకు భారీగా విద్యుత్ టూ వీలర్స్ సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు.

వచ్చేనెల 10 లోపు బిడ్లకు ఆహ్వానం

అంపేర్‌, ఒకినావా తదితర కీలక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థలు ప్రభుత్వోద్యోగులకు టూ వీలర్స్ సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. వచ్చేనెల 10 లోపు బిడ్లు దాఖలవుతాయని సర్కార్ భావిస్తున్నది.

ఏడాది లోపు ప్రభుత్వోద్యోగులందరికీ లక్ష ఈవీ టూ వీలర్స్ సరఫరా చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నదని, డిమాండ్‌ను బట్టి, ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసే టూవీలర్స్ సంఖ్య పెరుగవచ్చునని ఎస్ రమణా రెడ్డి చెప్పారు.

ఈఈఎస్ఎల్ ప్లస్ ఎన్టీపీసీ చేయూత

ఏపీ సర్కార్ ప్రతిపాదనకు ఈఈఎస్ఎల్‌తోపాటు థర్మల్ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ ఆర్థిక పరంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాయని ఎస్ రమణారెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణిఏప నగరాల్లో ఈవీ టూవీలర్స్ వాడకం పెంపునకు దోహద పడుతుందని అంచనా వేశారు.

వసతుల కల్పనపై ఇలా ఫోకస్

ప్రభుత్వోద్యోగులకు ఈ ఈవీ టూ వీలర్స్ సరఫరా చేయడానికి, వాహనాల సర్వీసింగ్ కోసం 13 జిల్లాల్లోని 650 మండలాలు, 100 మునిసిపాలిటీల్లో వసతుల కల్పనపై ద్రుష్టి సారించారు.

అంబులెన్స్‌, పీడీఎస్ కోసం ఇలా

అంబులెన్స్‌లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద సరుకులు పంపిణీ, చెత్తను తరలించేందుకు వేల సంఖ్యలో వ్యాన్లు, ట్రక్కులు ఇటీవల కొనుగోలు చేసింది ఏపీ సర్కార్‌. గతేడాదితో పోలిస్తే ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్‌లో 1.52 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2026 నాటికి ప్రతిఏటా 25 శాతం వార్షిక గ్రోత్ నమోదవుతుందని అంచనా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bumper: Lakh Electric Two Wheelers for Government Employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0