Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Compassion for a married daughter

పెళ్లయిన కుమార్తెకూ కారుణ్యం

Compassion for a married daughter

  • పెళ్లి కానివారు మాత్రమే అర్హులనడం సరికాదు
  • వివాహితలు పుట్టింటి కుటుంబంలో సభ్యులు కాదనడం దారుణం
  • పిల్లలందరికీ తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు
  • నియామకానికి పరిగణనలోకి తీసుకోండి
  • ఏపీఎస్‌ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

 ‘పెళ్లికాని కుమార్తెలు మాత్రమే అర్హులని ఎలా చెబుతారు? కొడుకు విషయంలో పెళ్లయిందా.. లేదా అనే తేడా చూపనప్పుడు.. కుమార్తెల విషయంలో ఆ వివక్ష ఎందుకు? పెళ్లయిన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే’ అని రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేటప్పుడు ‘పెళ్లికాని కుమార్తె’ మాత్రమే అర్హురాలని 2020 మే 5న ఏపీఎస్‌ఆర్టీసీ ఇచ్చిన సర్క్యులర్‌ను తప్పుబట్టింది. కుమార్తెకు పెళ్లయిందన్న కారణంతో.. ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దారుణమని చెప్పింది. కారుణ్య నియామక అర్హతలలో ‘అవివాహిత’ అనే పదాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటిస్తూ.. దాన్ని కొట్టేసింది. పిటిషనర్‌ దమయంతిని కారుణ్య నియామకం కింద తగిన ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పుచెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవరుగా పనిచేసిన తన తండ్రి పెంటయ్య 2009 మార్చిలో మరణించారని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తనకు పెళ్లయిందన్న కారణంతో అధికారులు తిరస్కరించారని సీహెచ్‌ దమయంతి 2014లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆమె తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ..  ‘మృతుడి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయగా, అర్హత లేదని అధికారులు తిరస్కరించారు. తర్వాత దమయంతి దరఖాస్తు చేయగా.. పెళ్లయిందని ఆమెనూ పరిగణనలోకి తీసుకోలేదు. జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే’ అన్నారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బ్రెడ్‌విన్నర్‌ పథకం కింద పిటిషనర్‌ అనర్హురాలు. పెళ్లయినందున ఆమె అభ్యర్థనను తిరస్కరించాం. 2020 మేలో ఆర్టీసీ ఇచ్చిన సర్క్యులర్‌ ప్రకారం మృతుల భార్య/భర్త, లేదా కుమారుడు లేదా పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హులు’ అన్నారు.

కుమారుడికి పెళ్లయినా తప్పులేదా..

ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే. ఆర్టీసీ సర్క్యులర్‌లో ‘పెళ్లికానివారే’ అర్హులన్నారు. అలా చెప్పడం పెళ్లయిన కుమార్తెల పట్ల వివక్ష చూపడమే. కుమారుడికి పెళ్లయినా.. వారికి ఎలాంటి షరతూ విధించలేదు. కుమారులు, కుమార్తెలు పెళ్లి చేసుకున్నారా.. లేదా? అనేదాంతో సంబంధం లేకుండా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమార్తెకు పెళ్లయినంత మాత్రాన ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదని చెప్పడం దారుణం. కుమారులు, కుమార్తెలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు ఉంటాయి. తల్లిదండ్రులు కన్నుమూస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన, కుటుంబ బాధ్యతలను మోస్తున్న ఎందరో కుమార్తెలను చూస్తున్నాం. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో ‘పిల్లలు’ (చిల్డ్రన్‌) అనే నిర్వచనం కిందకు కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు వస్తారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు కుమార్తెకు పెళ్లయిందా.. లేదా అనే వ్యత్యాసాన్ని పార్లమెంటు చూపలేదు. పెళ్లయినా తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఈ చట్టం తీసేయలేదు. తల్లిదండ్రుల అవసరాలు తీర్చే బాధ్యత పెళ్లయిన కుమార్తెలపైనా ఉంది. ప్రస్తుత కేసులో తండ్రి చనిపోయాక వితంతువైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఏకైక కుమార్తె అయిన పిటిషనర్‌పై ఉంది. పిటిషనర్‌ భర్తకు శాశ్వత ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో ఆమెను తగిన ఉద్యోగంలో కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Compassion for a married daughter"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0