Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Shortage of textbooks in government schools

సార్‌..పుస్తకాలెక్కడ?

Shortage of textbooks in government schools


  • ప్రభుత్వ బడుల్లో పాఠ్యపుస్తకాల కొరత
  • పెరిగిన ప్రవేశాలకు అనుగుణంగా లేని సరఫరా
  • ప్రతి జిల్లాలోనూ 20-25% తక్కువ
  • మార్కెట్‌లో కొనుక్కుంటున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల విద్యార్థులను పాఠ్యపుస్తకాల కొరత వేధిస్తోంది. సరఫరా  పూర్తిస్థాయిలో జరగకపోవడంతో కొందరు పుస్తకాలు లేకుండా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి జిల్లాల్లోనూ 20 నుంచి 25శాతం వరకు కొరత నెలకొంది. ఈ ఏడాది బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. దీనికి అనుగుణంగా పుస్తకాలను అందించకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

కరోనా కారణంగా చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధి దెబ్బతినడంతో ప్రైవేటు బడుల్లో ఫీజులను భరించలేక చాలామంది ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి రావడంతో సొంత ప్రాంతంలోని పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మాధ్యమంలో 1,44,556, ఆంగ్ల మాధ్యమంలో 2,44,418మంది విద్యార్థులు పెరిగారు. అధికారులు ఇందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయకపోవడం, జిల్లా, మండలస్థాయి నిల్వ కేంద్రాలకు సరఫరా చేసిన వాటిల్లోనూ బడులకు సక్రమంగా అందకపోవడంతో కొరత నెలకొంది. అదనంగా ముద్రించాల్సిన పుస్తకాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా ఇంతవరకు ఆమోదం లభించలేదు. 2019 సెప్టెంబరు వరకు ఉన్న విద్యార్థుల ఆధారంగా 1.20కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. దీనిపై 5శాతం అదనంగా ముద్రించారు.

  • కర్నూలు మండలంలోని వసంతనగర్‌ పాఠశాలలో149 మంది పిల్లలు ఉండగా.. ఇక్కడ 103మందికి మాత్రమే ఇచ్చారు.
  • అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల బడిలో 92మంది విద్యార్థులు ఉండగా.. 70మందికే వచ్చాయి.
  • ప్రకాశం జిల్లా చేవూరులో 145మందిలో 45మందికి ఇవ్వలేదు.
  • ప.గో.లోని పొడుమలలో 119మంది ఉంటే 29మందికి ఇవ్వలేదు.
  • విశాఖపట్నం మాధవధారలో 60మంది పుస్తకాలు లేకుండా బడికి వెళ్తున్నారు.
  • గుంటూరు రెడ్డికాలనీలో 150మంది పిల్లలు ఉండగా 50మందికి పాఠ్యపుస్తకాలు లేకుండా చదువుకుంటున్నారు
  • కృష్ణా జిల్లా కనుమూరులో 40మందికి, పెద్దపూడిలో 60, గంపలగూడెంలో 40మందికి ఇప్పటికీ పుస్తకాలు అందలేదు.
  • విజయనగరం జిల్లా కుమిలిలో 158మంది పిల్లలుఉంటే 44మందికి ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందలేదు.

 పరీక్షలు దగ్గర పడుతున్నా...

ఈ ఏడాది 1-6 తరగతి పాఠ్య పుస్తకాలను మూడు విభాగాలుగా ముద్రించారు. ఒక్కో పుస్తకంలో ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో పాఠ్యాంశాలు ఉన్నాయి. రెండు విభాగాల(సెమిస్టర్లు) పుస్తకాలను మండల కేంద్రాల వరకూ సరఫరా చేసినా ఇందులో కొన్ని పుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. అలాగే మూడో సెమిస్టర్‌ పుస్తకాలు ఇంకా జిల్లా కేంద్రాలకు కూడా అందలేదు. అయితే వీటిని ఏప్రిల్‌ 5వరకు బోధించాలని సూచించారు. ఏప్రిల్‌ 5 నుంచి మే మూడు వరకు ఒక్క నెలలోనే మూడో సెమిస్టర్‌ మొత్తం పూర్తి చేయాల్సిన పరిస్థితి. మే నెల 3వతేదీ నుంచి వార్షిక పరీక్షలు ఉంటాయి.

అంచనా కంటే అదనంగానే..

 ‘‘ప్రభుత్వ బడుల్లో ‘నాడు-నేడు’, జగనన్న విద్యా కానుకతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలోని అంచనా కంటే అదనంగా 5శాతం ముద్రించాం. జిల్లా నిల్వ కేంద్రాల నుంచి పాఠశాలలకు చేర్చడంలో కొన్నిచోట్ల మండల విద్యాధికారులు అలసత్వం వహించినట్లు గుర్తించాం.  పుస్తకాలు విద్యార్థులకు అందించాలని ఆదేశించాం’’

మధుసూదన్‌, ఇన్‌ఛార్జి సంచాలకులు, పాఠ్యపుస్తకాల విభాగం

పలుమార్లు చెప్పినా

 పాఠ్యపుస్తకాల కొరతపై ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించాం. కొత్తగా బడుల్లో చేరిన వారికి జగనన్న విద్యాకానుక, పాఠ్యపుస్తకాలు అందలేదు. వచ్చిన వాటిల్లోనూ కొన్ని సబ్జెక్టుల కొరత ఉంది.

వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Shortage of textbooks in government schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0