Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona second stage outbreak .. Parental anxiety

బడికి పంపాలా..వద్దా..?

Corona second stage outbreak .. Parental anxiety

కరోనా రెండో దశ వ్యాప్తి.. తల్లిదండ్రుల ఆందోళన

 కరోనా మహమ్మారితో చిన్నాభిన్నమై ఇప్పుడి ప్పుడే గాడిన పడుతున్న విద్యా వ్యవస్థ ను కరోనా రెండోదశ కలవర పెడుతోం ది. పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండడం విద్యార్థులు, ఉపాధ్యా యులు, తల్లిదండ్రులకు ఆందోళన కలి గిస్తోంది. పిల్లలను బడికి పంపాలా.. వద్దా.. అన్న మీమాంసలో తల్లిదండ్రు లు ఉన్నారు. మరోవైపు పాఠశాలల్లో కరోనా రక్షణ చర్యలు కన్పించడం లే దు. కరోనా తీవ్ర తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించింది. రెండుపూటలా తరగతులు నిర్వహిస్తోంది. ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒకే చోట పదుల సంఖ్యలో గుమ్మిగూడి ఉండే విద్యార్థులకు ఎక్కడ వైరస్‌ సోకుతుం దోనన్న భయం ఆందోళనకు గురిచేస్తోంది. చివరకు అనుకున్నదే అయింది. ఏలూరు రూరల్‌ మండలం శనివారపుపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా లలో ఇటీవల నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిం ది. దీంతో మూడు రోజుల క్రితం పాఠశాలల విద్యార్థులకు శ్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించగా మరో నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిం ది. విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలను బడికి పంపాలా వద్దా అని సందేహిస్తున్నారు. 

ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వైరస్‌ బారిన పడకుండా ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. వారం రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒకవైపు ప్రజల్లో ఆందోళన నెలకొనగా, ఇంకో వైపు ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సెకండ్‌ వేవ్‌, కరోనా కేసుల నమోదు ప్రాంతాలను గుర్తించి టెస్ట్‌లు విస్తృతంగా చేస్తు న్నారు. ఈవిధంగా రోజుకు గ్రామాల్లో నిర్దిష్టంగా టెస్ట్‌లు చేపడుతున్నారు. 

వ్యాక్సినేషన్‌ వేగవంతం

ప్రభుత్వాదేశాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను గ్రామాల్లో వేగవంతం చేస్తు న్నారు. ప్రస్తుతం సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్‌ చేసేలా ఏర్పా ట్లు చేశారు. వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. గ్రా మాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌పై విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona second stage outbreak .. Parental anxiety"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0