Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know the differences between the different carats in gold ..?!

 బంగారంలో ఉండే వివిధ క్యారెట్స్ మధ్య ఉన్న తేడాలు ఏంటో వివరణ.

Do you know the differences between the different carats in gold ..?!

మన భారతీయులకు ఎక్కువగా బంగారం అంటే ఇష్టం.మహిళలకు బంగారు ఆభరణాలు ధరించడం, కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం.

మనం సాహజంగా ఎక్కువగా బంగారం గురించి ఏదైనా వార్తలు వస్తే ముందుగా.

24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు అనే పేర్లు వింటూనే ఉంటాం.

ఇంతకీ క్యారెట్ అంటే ఏమిటి.? ఆ మూడు రకాల బంగారాల మధ్య ఉన్న తేడా ఏమిటి.? అన్న విషయాలు మనమిప్పుడు తెలుసుకుందామా.నిజానికి క్యారెట్ అంటే బంగారం నాణ్యతకు ఒక సూచిక.దీనిని 0-24 మీద కొలుస్తూ ఉంటారు.24/24 అంటే బంగారం చాలా స్వ‌చ్ఛ‌మైన బంగారం అని అందరూ అంటూ ఉంటారు.అదే 22/24, 18/24 ఐతే స్వచ్ఛమైన బంగారం కాదని వీటిలో ఇతర లోహాలు కలుపుతారని అర్థం.ఐతే 24 బంగారం లో కూడా 100 బంగారం ఉండదు, దీనిలో కూడా 99.99 స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగితా శాతం ఇతర ఏదైనా లోహాలు కలిసి ఉంటాయి.ఇక అదే 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.ఇందులో బంగారం 91.67 శాతం బంగారం ఉంటుంది.అందువల్లనే అందరూ దీన్ని 916 గోల్డ్ అంటారు.

అదే 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.ఇందులో బంగారం 75 శాతం ఉంటుందని దీనిని అందరూ750 ప్యూరిటీ బంగారం అని పిలుస్తూ ఉంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, మిగితది ఇతర లోహాలు కలిసి ఉంటాయి.సహజంగా బంగారంతో పాటు నికెల్, కాపర్, జింక్ లాంటి లోహాలను కలుపుతూ ఉంటారు.

ఇక మూడు రకాల క్యారెట్లు బంగారంలలో 24 క్యారెట్ల బంగారం నాణ్యమైనది, స్వచ్ఛమైనది.చాలా వరకు ఆభరణాల తయారీలో 22 క్యారెట్ బంగారంని ఉపయోగిస్తూ ఉంటారు.మరికొంతమంది అయితే ఆభరణాల ధర తక్కువగా ఉండేందుకు 18 ఉపయోగిస్తూ ఉంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know the differences between the different carats in gold ..?!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0