Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exam Tips: Do not want tension in exams .. The best results if prepared like this .. Expert advice for students

 Exam Tips: పరీక్షలంటే టెన్షన్ వద్దు.. ఇలా ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలు.. విద్యార్థులకు నిపుణుల సూచనలు.

Exam Tips: Do not want tension in exams .. The best results if prepared like this .. Expert advice for students

వివిధ బోర్డు పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో విద్యార్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగింది. ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయన్నది అంతు చిక్కని ప్రశ్నే. ఇంటర్ నెట్ సమస్యతో పాటు వివిధ కారణాలతో అనేక మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారు.

పేద, మధ్య తగరతి విద్యార్థులు అయితే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేక పోవడంతో వారి చదువులు అరకొరగా సాగాయి. ఏది ఏమైనా బోర్డు పరీక్షలు మాత్రం ఈ సారి రద్దు చేసే పరీక్షలు లేవని అధికారులు, ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే వివిధ బోర్డు పరీక్షలు, ప్రవేశ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. దీంతో అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చదివితే ఆయా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

  • 1. టైం టేబుల్ రూపొందించుకోవడం.. పరీక్షలను అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది సిలబస్. కొండంత సిలబస్ చూసి విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. అయితే టైం టేబుల్ రూపొందించుకుని చదివితే ఆ సిలబస్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • టైం టేబుల్ లేకుండా చదివితే ఎంత సిలబస్ పూర్తయింది?, ఇంకెంత మిగిలింది? అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పుతుంది. దీంతో పరీక్షల నాటికి టెన్షన్ పడాల్సి వస్తుంది. టైం టేబుల్ లో మొదటగా ముఖ్యమైన అంశాలను చేర్చుకోవడం మేలు.
  • 2.మాక్ ఎగ్జామ్స్.. ఎన్ని గంటలు చదివాం? ఎంత సిలబస్ చదివాం? అన్న అంశాల కంటే పరీక్షల్లో ఎంత మేరకు రాశాం? అన్నది ముఖ్యమైన అంశం. దాని ఆధారంగానే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అయితే బోర్డు పరీక్షలకు ముందే విద్యార్థులు మోడల్ పరీక్షలు రాస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • పాత పేపర్లు, ఇతర మోడల్ పేపర్లతో విద్యార్థులు మాక్ టెస్టులు రాస్తే ఏ అంశాల నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి?, ఏ అంశాల్లో వీక్ గా ఉన్నాం? అన్న అంశాలపై స్పష్టత వస్తుంది.
  • 4.ఒత్తిడికి గురి కావొద్దు.. ఒత్తిడి లేని మనస్సు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెబుతుంటారు. అయితే విద్యార్థులు ప్రిపరేషన్ తో పాటు ఒత్తిడి తగ్గించుకోడం కోసం కొంత సమయాన్ని వినోద కార్యకలాపాలకు కేటాయించుకోవడం మంచిది. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
  • 5. పాజిటీవ్ గా ఉండడం.. ఇంత సిలబస్ పూర్తి చేస్తామా?, లేదా? పాస్ అవుతామా?, లేదా? అన్న సందేహాలతో ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. పాజిటీవ్ ఆలోచనతో ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలను సాధిస్తామని నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exam Tips: Do not want tension in exams .. The best results if prepared like this .. Expert advice for students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0