Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of how to add new wife or child names in ration card.

 రేషన్ కార్డులో కొత్తగా భార్య గాని పిల్లల పేర్లు కొత్తగా చేర్చాలి  ఎలానో వివరణ.

Explanation of how to add new wife or child names in ration card.

గత కొద్ది రోజులుగా 3 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేయబడినట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనుసంధానం సరిగ్గా చేయకపోవడమే. దీనిపై సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాల ద్వారా వివరణ కోరింది. అయితే చాలా మంది పేర్లను రేషన్ జాబితా నుంచి తొలగించారు. ఒక కుటుంబంలో భార్య, పిల్లలు, పెద్దవాళ్ల పేర్లు ఎవరైనా రేషన్ జాబితాలో తొలగించినట్లయితే తిరిగి రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.
రేషన్‌కార్డు నుంచి పేరు తొలగించబడటానికి కారణం..
అనేక కారణాల వల్ల రేషన్‌కార్డు నుంచి పేర్లను తొలగించబడుతుంది. ఉదాహరణకు.. మీ పేరు ఇప్పటికే మరొక రేషన్‌కార్డులో లింక్ చేయబడిలే, ఆధార్‌కార్డు నంబర్ మీ రేషన్‌కార్డుతో అనుసంధానం చేయడానికి కుదరదు. ఒక వేళ రేషన్‌కార్డులో పేరు ఉన్న వ్యక్తి మరణించినట్లయితే పేరును తీసివేయవచ్చు. అయితే రేషన్‌కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా మీరు రేషన్‌కార్డులో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. వివాహం జరిగిన తర్వాత భార్య, పుట్టిన పిల్లల పేర్లను రేషన్‌కార్డులో నమోదు చేసుకోవాలి. అయితే పెళ్లి అయిన వ్యక్తి ఇది వరకే తల్లిదండ్రుల పేర్లతో ఉన్న రేషన్‌కార్డులో పేరు ఉంటుంది. అయితే పాత రేషన్‌కార్డులో పేరు తొలగించి.. పెళ్లి తర్వాత మరొక రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆధార్ కార్డు నంబర్‌ను మీ రేషన్‌కార్డుతో లింక్ చేయకూడదు. ఒకవేళ ఇంటి పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు మీ పేరును తొలగించే ప్రమాదం ఉంది.
దరఖాస్తు తప్పనిసరి..
రేషన్ కార్డు నుంచి మీ కుటుంబ సభ్యుల పేరును తొలగిస్తే.. ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకుని స్థానిక సీఎస్పీ సెంటర్, మీ-సేవ కేంద్రానికి వెళ్లి.. మీ వివరాలు, పేర్లతో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసినట్లు రశీదు పొంది.. స్థానిక తహసీల్దార్‌కు సమర్పించాలి. అలా కొద్ది రోజుల తర్వాత మీ పేరును రేషన్ కార్డులో జోడించబడుతుంది.
కొత్త సభ్యుల పేర్లు నమోదు చేసుకోండిలా..
కొత్త సభ్యుల పేర్లను రెండు విధాలుగా రేషన్ కార్డులో ఎక్కించుకోవచ్చు. పుట్టిన పిల్లాడి పేరు, భార్య పేరు నమోదు చేసుకోవాలి. అయితే పెళ్లికి ముందు మీ పేరు మీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటుంది. మొదటగా మీ పేరును మీ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి, మీ భార్య పేరును వాళ్ల తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి తొలగించుకోవాలి. అలా మీ భార్య పేరుపై తండ్రి పేరును తొలగించి మీ పేరు నమోదు చేసుకోవాలి. మీ భార్య అడ్రస్‌ను మీ అడ్రస్‌కు మార్పించుకోవాలి. అలా ఛేంజ్ చేసిన ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలోని ఆహార శాఖ అధికారికి ఇవ్వండి. అలా కొత్త ఆధార్ కార్డుతో రేషన్ కార్డు పొందవచ్చు. ఆన్‌లైన్ ధ్రువీకరణ తర్వాత కొత్త రేషన్ కార్డులో భార్య, పిల్లల పేర్లు నమోదు చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of how to add new wife or child names in ration card."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0