Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Five new regulations in IT from April 1st

 ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

Five new regulations in IT from April 1st

1) పిఎఫ్ పన్ను నియమాలు:

2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్‌ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్‌ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

2) టిడిఎస్:

ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్‌లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల‌ అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు.

3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు:

సీనియర్ సిటిజన్లపై ప‌న్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్‌లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న‌ బ్యాంక్ నుంచి ల‌భించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది

4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు:

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంల‌లో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 

5) ఎల్‌టిసి:

సెలవు ప్రయాణ రాయితీ(ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Five new regulations in IT from April 1st"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0