Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Find My Device Lost your smartphone? Find out where it is. For this you must pre-set some settings on your smartphone. Find out what those settings are.

 Find My Device : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా ? ఎక్కడ ఉందో మ్యాప్లో తెలుసుకొనే విధానం.

Find My Device Lost your smartphone? Find out where it is. For this you must pre-set some settings on your smartphone. Find out what those settings are.

Find My Device మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా కొన్ని సెట్టింగ్స్ ముందే చేయాలి. ఆ సెట్టింగ్స్ ఏవో తెలుసుకోండి.

కొందరికి స్మార్ట్‌ఫోన్ పోతే ప్రాణం పోయినట్టవుతుంది. ఈ గ్యాడ్జెట్‌ను అంత అపురూపంగా చూసుకుంటారు. అందులో ముఖ్యమైన కాంటాక్ట్స్, ఇమెయిల్, ఫోటోలు, వీడియోలు, ప్రైవేట్ డేటాతో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల సమాచారం కూడా ఉంటుంది. అందుకే ఫోన్ పోయిందంటే చాలు టెన్షన్ మొదలవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ పోతే ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఫోన్ దొరకడం కష్టం అనుకున్నప్పుడు అందులోని డేటాను డిలిట్ చేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు Find My Device ఫీచర్‌ని అందిస్తోంది. ఈ ఫీచర్‌ని మీరు ఉపయోగించుకోవాలంటే అందుకు తగ్గట్టుగా ముందుగానే సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఫీచర్‌తో మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడం కష్టం. డేటా డిలిట్ చేయడం కూడా సాధ్యం కాదు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు ఫైండ్ మై డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ డేటా ఆన్ చేసి ఉండాలి. లేదా వైఫై నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉండాలి. లొకేషన్ సెట్టింగ్స్ అంటే జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్స్ కూడా ఆన్ చేసి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటే మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. స్మార్ట్‌ఫోన్ పోయినట్టైతే ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా వేరే మొబైల్‌లో android.com/find వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో మ్యాప్‌లో కనిపిస్తుంది. అంతే కాదు... ఫోన్ మీకు దగ్గర్లో ఉన్నట్టు మ్యాప్‌లో కనిపిస్తే PLAY SOUND అనే బటన్ పైన క్లిక్ చేస్తే చాలు. ఫోన్ ఎక్కడ ఉన్నా 5 నిమిషాలపాటు గట్టిగా రింగ్ అవుతుంది.

ఫైండ్ మై ఫీచర్ సాయంతో మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలిసినా ఇక ఆ ఫోన్ తిరిగి చేజిక్కించుకోవడం అసాధ్యం అని మీకు అనిపిస్తే అందులే డేటాను ఎరేజ్ చేయొచ్చు. ఇందుకోసం android.com/find వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత SET UP SECURE & ERASE పైన క్లిక్ చేయాలి. SECURE పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ మీరే లాక్ చేయొచ్చు. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసి ఫోన్ ఎక్కడ ఉందో లొకేషన్ చూపించి మీ స్మార్ట్‌ఫోన్ ట్రేస్ చేయొచ్చు. లేదా మీ ఫోన్‌లోని డేటాను డిలిట్ చేయాలంటే ERASE పైన క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లోని డేటా మొత్తం డిలిట్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీ ఫోన్‌లో మొబైల్ డేటా ఆఫ్‌లో ఉన్నా, వైఫైకి కనెక్ట్ చేయకపోయినా, లొకేషన్ ఆన్‌లో లేకపోయినా ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్స్ ఆన్‌లో లేకపోయినా ఈ ఫీచర్స్ మీరు ఉపయోగించుకోలేరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Find My Device Lost your smartphone? Find out where it is. For this you must pre-set some settings on your smartphone. Find out what those settings are."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0