State teams to inspect NADU-NEDU work
నాడు–నేడు పనుల పరిశీలనకు రాష్ట్ర బృందాలు..?
అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ
వారంలో పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
తొలి దశలో జిల్లాలో ఎంపికైన 1117 ప్రభు త్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులను వంద శాతం (సివిల్ వర్క్స్) పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ‘పశ్చిమ’లో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వ బృందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. మొత్తం తొమ్మిది రకాల పనుల్లో సివిల్ వర్క్స్‌కు సంబంధించి సుమారు 15 నుంచి 25 పనులు మినహా మిగతావన్నీ పూర్తి చేశారు. ఆ మేరకు సివిల్ వర్క్స్ బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయ డంతో పాటు, పనులు పూర్తయి నట్టుగా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో నిర్దేశిత పనులను భౌతికంగా పూర్తి చేశారా, లేదా అనే అంశాలపై మండలాల వారీగా సూక్ష్మ పరిశీలనలు జరపా లని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకవేళ రాష్ట్ర అధికారుల బృందాలు జిల్లా పర్యట నకు వస్తే ఎక్కడా లోపాలు కనపడకూడదన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకుం టోంది. ఈ క్రమంలో రివాల్వింగ్ ఫండ్ సరిపడా లేక తుది దశలో సివిల్ వర్క్స్ నిలిచిపోయిన పాఠశాలలకు సమీప పాఠశాలలకు కేటాయించిన నిధుల్లో మిగు లు ఉన్న చోట నుంచి డిమాండ్ ఉన్న స్కూలుకు బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయ డానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాగల వారం రోజుల వ్యవధిలో పనులు పూర్తి చేయనున్నారు. ఇక సెంట్రలైజ్డ్ ఏజన్సీల నుంచి సరఫరా అయ్యే గ్రీన్ చాక్ బోర్డులు, టెలివిజన్లు, తాగునీటి శుద్ధి పరికరాల యూనిట్ల సరఫరా జరుగుతుం ది. పెయింటింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే జిల్లా స్థాయిలో చేపట్టే సివిల్ వర్క్స్‌లో ‘పశ్చిమ’ నూరుశాతం ప్రగతి కనబరచడం వల్ల మిగిలిన అన్ని జిల్లాలకు రోల్ మోడల్ కానుంది. కాగా రెండో దశ నాడు–నేడు కార్య క్రమం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుండగా ఈ దఫా పాఠశాలల తో పాటు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలను మౌలిక సదు పాయాలతో అభివృద్ధి చేయనున్నారు.
0 Response to "State teams to inspect NADU-NEDU work"
Post a Comment