Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

gold Hold Legally: Did you know that we have an account for the gold we have?

 Gold Hold Legally : మన దగ్గర ఉండే బంగారానికి ఓ లెక్క ఉందాలని తెలుసా? ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉండాలో వివరణ.


Gold Hold Legally India: భారతీయులను, బంగారాన్ని వేరు చేసి చూడలేం. అంతలా మన సంప్రదాయాల్లో బంగారం ఓ భాగమైపోయింది. వివాహాది శుభకార్యాక్రమాలంటే ముందుగా ఎంత బంగారం కొనుగోలు చేశారనే ప్రశ్నే వస్తుంది. అంతే కాకుండా భారతీయులకు గోల్డ్‌ ఒక సెంటిమెంట్‌. ఏదైనా మంచి రోజు వస్తే కొంత బంగారం కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఇక మరికొందరు బంగారాన్ని పెట్టబడి పెట్టడానికి ఒక మార్గంగా ఎంచుకుంటారు. ఏటు పోయి ఏటు వచ్చినా బంగారం కాపాడుతుందని చాలా మంది భావన. ఈ క్రమంలోనే బంగారాన్ని తాకట్టుగా పెట్టుకొని రుణాలు ఇచ్చే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాయి.

అయితే బంగారం కొనుగోలు చేయడం, అది ఆర్థిక భద్రత ఇస్తుందనేంత వరకు ఓకే మరి మీ దగ్గర అసలు ఎంత బంగారం ఉండాలి.

లెక్కకు మించిన ఆదాయం ఉంటే కూడా సమస్యలు ఎదురవుతాయనే విషయం మీకు తెలుసా? మరీ ముఖ్యంగా నల్లధనాన్ని వెలికి తీయడంలో భాగంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మార్పులు దృష్ట్యా ఇప్పుడు బంగారం నిలువలపై అందరి దృష్టిపడింది. ఆదాయపపు పన్ను చట్టం 1961లో సెక్షన్‌ 132 ప్రకారం ఆదాయ శాఖ అధికారులు తనిఖీలు జరిపినప్పుడు లెక్కలో లేని ఆభరణాలను లేదా ముడి బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర లెక్కకు మించిన బంగారం ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌ ప్రూఫ్స్‌ ఉండాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా ఏమీ కాదు. ఈ విషయాన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (CBDT) గతంలోనే వెల్లడించింది. ఇక ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చన్న విషయానికొస్తే.. పెళ్లైన మహిళలు ఎవరైనా 500 గ్రాముల బంగారం వరకు కలిగి ఉండొచ్చు. అదే.. పెళ్లి కానీ వారి విషయానికొస్తే.. 250 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. అలాగే మగవారు తమ వద్ద 100 గ్రాములు కలిగి ఉండొచ్చు. ఈ పరిమితి దాటి మీ దగ్గర బంగారం ఉంటే మాత్రం కచ్చితంగా వాటికి లెక్కలు చెప్పాల్సిందే.. లేదంటే అధికారులు మీ దగ్గర ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "gold Hold Legally: Did you know that we have an account for the gold we have? "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0