Kovid tests at schools
పాఠశాలల వద్దే కోవిడ్ పరీక్షలు
ఇప్పటికే 1516 మంది విద్యార్థులకు, 476 మంది సిబ్బందికి వ్యాధి
తాజాగా తిరుమల వేద పాఠశాలలో 50 మంది పిల్లలకు కరోనా
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ
పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిత్యం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కరోనా పరీక్షల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో 11.87 లక్షల మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 1516 మందివ్యాధి బారిన పడినట్లు నిర్ధారించింది. మరో 126 లక్షల మంది బోధన సిబ్బందికి తనిఖీలు చేయగా వారిలో 476 మంది కరోనా వ్యాధితో బాధపడు తున్నట్లు గుర్తించి చికిత్స అందించింది. తాజాగా తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఒకేసారి సుమారు 50 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు అనుమానం రావడంతో వారిని హుటాహుటిన పద్మావతి కోవిడ్ కేంద్రానికి తరలించారు. దీంతో వైద్యారోగ్యశాఖ మరోసారి అప్రమత్తమైంది.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రయివేటు పాఠ శాలల్లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా శానిటైజర్స్, సబ్బులు అందుబాటులోనే ఉంచు తున్నారు. మాస్క్ లేని విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా లక్షణాలతో విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో మరింత జాగ్రత్తలు అవసరమని గుర్తించిన ప్రభుత్వం నేరుగా పాఠశాలల వద్దకే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వాహనాలను పంపించాలనే ఆలోచనలో ఉంది. ఏ ఒక్క విద్యార్థికి కొంచెం జ్వరం వచ్చినా వెంటనే తనిఖీలు చేసి వారి నుంచి ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 249 మందికి, తూర్పుగోదావరిలో 201 చిత్తూరులో ప్రకాశంలో 131, పశ్చిమగోదావరిలో 129కడపలో 115, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 99 మందికి చొప్పున, అనంతపురంలో 82 కర్నూలులో 76. శ్రీకాకుళంలో 74. నెల్లూరులో 67, విజయనగరంలో 17 మంది విద్యార్థులు వ్యాధి బారిన పడినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటి వరకూ వ్యాధి లక్షణాలతో రాష్ట్ర వ్యాప్తంగా మంది విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ స్కూల్ బస్సులను కూడా నిత్యం శానిటైజ్ చేయాలని ప్రతిరోజూ తరగతి గదిలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని, ఎటువంటి లక్షణాలు కనిపించినా ప్రధానోపాధ్యాయులు అప్రమత్తమై దగ్గర్లో ఉన్న తనిఖీ కేంద్రానికి తరలించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో మరో 120 మందికి కరోనా
రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 48,973
మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 120 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. చిత్తూరులో ఒకరు మరణించారు. మరో 93 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 1064 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు . బుధవారం అత్యధికంగా చిత్తూరులో 35, కృష్ణాలో 25, విశాఖలో 17 కేసులు నమోదయ్యాయి పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క సూ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ బులిటెన్ లో పేర్కొంది.
0 Response to "Kovid tests at schools"
Post a Comment