Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Looking forward for DSC.

డీఎస్సీ కోసం ఎదురు చూపులు.

Looking forward for DSC.

2018 నుంచి నోటిఫికేషనే లేదు

జిల్లాలవారీగా ఖాళీలపై స్పష్టత

 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 2018 తర్వాత ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుందా అని ఆశగా ఉన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులో ప్రాధాన్యాంశంగా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ పలు వేదికలపై అనేక ప్రకటనలు చేశారు. అయితే నేటికీ ఆ ప్రకటనలు కార్యరూపం దాల్చకపోవడంతో డీఎస్సీ ఆశావహులకు నిరాశే ఎదురవుతోంది. అయితే, విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులపై కసరత్తు ప్రారంభించడంతో త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

 ప్రభుత్వానికి అందిన నివేదిక

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మొత్తంలో 14 వేల 61 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నట్లు లెక్క తేల్చింది. జిల్లాల వారీగా ఉన్న భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా ప్రభుత్వానికి చేరడంతో ఆర్థిక శాఖ అనుమతి తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుందనిఆశావహులు భావిస్తున్నారు. మొత్తం పోస్టుల్లో ఆరు జిల్లాల్లో వెయ్యికిపైగా ఖాళీలు ఉన్నట్లు జాబితా ప్రకారం తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2 వేల 552 ఖాళీలు ఉండగా.. అనంత పురము జిల్లాలో అత్యల్పంగా 467 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్ సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల క్లియరెన్స్ రాగానే డీఎస్సీ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

టెట్ మార్గదర్శకాల జీవో

రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. దీంతో బదిలీల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి టెట్, తర్వాత డీఎస్సీ విడుదలవుతుందనే ఆశలు నిరుద్యోగుల్లో చిగురించాయి. ఈ విద్యా సంవత్స రంలో 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విషయం తెలిసిందే

ఎస్టీటీ ఖాళీలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో 862, విజయనగరంలో 838 విశాఖపట్నంలో 1165, తూర్పు గోదావరి జిల్లాలో 1490, పశ్చిమ గోదావరిలో 1315, కృష్ణా జిల్లాలో 1094, గుంటూరులో 911, ప్రకాశంలో 798, నెల్లూరు జిల్లాలో 1256, చిత్తూరులో 2552, కడప జిల్లాలో 807 అనంతపురములో 467, కర్నూలు జిల్లాలో 506 పోస్టుల చొప్పున మొత్తం పోస్టులు 14 వేల 61 ఖాళీగా ఉన్నాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Looking forward for DSC."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0