Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Now anyone can read engineering

 ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ చదవొచ్చు

Now anyone can read engineering


  • ఇకపై మ్యాగ్స్ , ఫిజిక్స్ లేకున్నా ఇంజనీరింగ్ లో ప్రవేశాలు 
  •  ఏఐసీటీఈ కీలక నిర్ణయం 
  • ప్రవేశ అర్హతల తుది నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టీకరణ 

 బీఈ / బీటెక్ ప్రవేశాలకు విద్యా ర్థులకు అర్హతల విషయంలో అఖిల భారత సాంకే తిక విద్యా మండలి ( ఏఐసీటీఈ ) కీలక నిర్ణయం తీసుకుంది . 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజ నీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియెట్ లో కచ్చితంగా మ్యాథమెటిక్స్ , ఫిజిక్స్ చదివి ఉండాలన్న నిబంధనను తొలగించిం ది . వాటిని ఆప్షనల్ గానే పేర్కొంది . నిర్దేశిత అర్హ తల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని స్టు వెల్లడించింది . వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభు త్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని , ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవే ర్ల శాలు ఉంటాయని పేర్కొంది . అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు / యూని వర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైసల్ అని స్పష్టం చేసింది .

గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి .. 

2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూ వల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ ( రివైజ్ ) 2020-21లో బీఈ / బీటెక్ / బీఆర్క్ / బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్ల డించింది . ఫిజిక్స్ , మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టు లను విద్యార్థులు తప్పనిసరిగా చదివి ఉండాలని స్పష్టం చేసింది . వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది . అందులో కెమిస్ట్రీ / బయోటె క్నాలజీ / బయాలజీ / టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్ఫ ర్మాటిక్స్ ప్రాక్టీసెస్ / అగ్రికల్చర్ / ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ / బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది . అంటే బీఈ / బీటె క్ / బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ / బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియెట్ లో ( 12 వ తరగతి ) మ్యాథమెటిక్స్ , ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలని పేర్కొంది . అయితే తాజాగా మ్యాడ్స్ , ఫిజిక్స్ విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగిం చింది . 2021-22 విద్యా సంవత్సరంలో బీఈ / బీటెక్ లో చేరాలంటే ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ / మ్యాథమెటిక్స్ / కెమిస్ట్రీ / కంప్యూటర్ సైన్స్ / ఎల క్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / బయాలజీ / ఇన్ ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్ / బయోటెక్నాలజీ / టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు , ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ / బిజినెస్ స్టడీస్ / ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Now anyone can read engineering"

  1. Which exams we will write for admission in engineering as a bipc student by a chance

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0