Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Home Loan: Good news for home buyers ... SBI has slashed home loan interest rates drastically

 SBI Home Loan: ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేటు భారీగా తగ్గించిన SBI.

SBI Home Loan: Good news for home buyers ... SBI has slashed home loan interest rates drastically


SBI Home Loan Offer  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే.

  • 1. హోమ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి, ఇల్లు కొనాలనుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించింది. 10 బేసిస్ పాయింట్స్ తగ్గడంతో ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతానికి దిగొచ్చింది.
  • 2. హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గించడం మాత్రమే కాదు... 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ 2021 మార్చి 31 వరకే. ఆ తర్వాత మళ్లీ పాత వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి.
  • 3. ఇంత తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందాలంటే రుణగ్రహీతల సిబిల్ స్కోర్ బాగుండాలి. మంచి పేమెంట్ హిస్టరీ ఉన్నవారికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఇస్తామంటోంది ఎస్‌బీఐ.
  • 4. సిబిల్ స్కోర్ బాగున్నవారికి 6.70 శాతం వడ్డీ రేటుకే రూ.75,00,000 వరకు హోమ్ లోన్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ లోన్ తీసుకుంటే వడ్డీ 6.75 శాతం నుంచి మొదలవుతుంది.
  • 5. కస్టమర్లు యోనో యాప్ ద్వారా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి అదనంగా 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గుతుంది. ఇక అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు కూడా 5 బేసిస్ పాయింట్స్ తగ్గింపు ప్రకటించింది ఎస్‌బీఐ.
  • 6. ఎస్‌బీఐ ఇంత తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఆఫర్ చేయడం ఇదే మొదటి సారి. కొంతకాలంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో 2020 డిసెంబర్ 31 నాటికి రూ.5 లక్షల కోట్లు దాటడం విశేషం.
  • 7. ఎస్‌బీఐలో డిపాజిట్ బేస్ 35 లక్షల కోట్లు, అడ్వాన్సులు 26 లక్షల కోట్లు ఉన్నాయి. కాసా రేషియో 45 శాతం పెరిగింది. హోమ్ లోన్ మార్కెట్‌లో ఎస్‌బీఐ వాటా 34 శాతం ఉండగా, ఆటో లోన్ సెగ్మెంట్‌లో ఎస్‌బీఐ వాటా 33 శాతం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Home Loan: Good news for home buyers ... SBI has slashed home loan interest rates drastically"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0