An explanation of how EMIs are calculated in a bank.
బ్యాంకు లో EMI లు ఎలా లెక్కగడతారో వివరణ.
చాలామందికి వివిధ రకాల రుణాలు ఉంటాయి. ఈ కారణంగా నెలవారి ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎమ్ఐలు చెల్లించేందుకే పోతుంది. ముఖ్యంగా గృహ రుణానికి ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు ఈఎమ్ఐ ఎలా లెక్కిస్తాయో తెలుసా ?
తీసుకున్న మొత్తం రుణం, వడ్డీతో కలిపి ఈఎమ్ఐ ఉంటుంది. రుణం తీసుకున్న మొదట కొన్ని సంవత్సరాలలో ఈఎమ్ఐలో రుణ భాగం తక్కువగా, వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత మొత్తం తీసుకున్నారో దాని ప్రకారం ఈఎమ్ఐ పడుతుంది.
వడ్డీ చెల్లింపులు
వడ్డీని బ్యాంకులు మూడు రకాలుగా తీసుకుంటాయి, నెలవారిగా, వార్షికంగా లేదా రోజువారిగా లెక్కిస్తాయి. గృహ రుణాలపై రోజువారిగా వడ్డీ లెక్కింపు ఉంటుంది.
అయితే కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు నెలవారిగా వర్తింపజేస్తాయి.
ఈఎమ్ఐ నెలవారిగా చెల్లిస్తారు కాబట్టి వడ్డీ రేటులో పెద్దగా తేడా ఉండదు. అయితే ముందస్తు చెల్లింపులు చేస్తే రోజువారీగా రుణ మొత్తం తగ్గుతుంది. అంటే ఒక నెల ఈఎమ్ఐ 5 వ తేదీన చెల్లించి 10 వ తేదీన ముందస్తు చెల్లింపులు చేస్తే, ఆ తర్వాత నెల ఎంత మొత్తం రుణం మిగిలిందో దానికి తగినట్లుగా ఈమ్ఐ లెక్కిస్తారు లేదా ఈఎమ్ఐ చెల్లించే నెలలను కూడా తగ్గించుకోవచ్చు. అంటే రుణాన్ని తొందరగా పూర్తి చేయవచ్చు.
ఈఎమ్ఐ లెక్కింపు
ఈఎమ్ఐ మూడు అంశాల ఆధారంగా లెక్కిస్తారు- రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితి
PMT ఫార్ములాతో సులభంగా Excel లో ఈఎమ్ఐ లెక్కించవచ్చు. దానికోసం వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, ప్రస్తుత వడ్డీ రేట్లు అవసరం. ఉదాహరణకు, రుణం రూ.50 లక్షలు అనుకుంటే 10 శాతం వడ్డీ , 20 సంవత్సరాలు కాలపరిమితి అయితే నెలకు రూ.48,251 ఈఎమ్ఐ పడుతుంది.
గణిత ఫార్ములా PR((1+R)^n)/(1-(1+R)^n) ద్వారా కూడా ఈఎమ్ఐ లెక్కించవచ్చు. ఇక్కడ
P- is the principal outstanding (రుణ మొత్తం)
R- is the monthly rate of interest ( నెలకు వర్తించే వడ్డీ)
n -is the number of monthly instalments (రుణ కాలపరిమితి)
0 Response to "An explanation of how EMIs are calculated in a bank."
Post a Comment