Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vaccination is further exacerbated

 డేంజర్ బెల్

Vaccination is further exacerbated


  • స్కూళ్లలో మాటేసిన మహమ్మారి
  • కరోనా హాట్ స్పాట్లుగా విద్యాసంస్థలు
  • రాష్ట్రంలో విస్తృత వ్యాప్తి 
  • ఒక్కరోజే 492 కేసులు నమోదు
  • ఆరు జిల్లాల్లో అత్యధిక ప్రభావం
  • రాజమండ్రి స్కూల్లో 163మంది విద్యార్థులకు పాజిటివ్
  • అప్రమత్తమైన ప్రభుత్వం 
  • మంత్రుల అత్యవసరభేటీ
  • రేపటి నుంచి అవగాహనా కార్యక్రమాలు
  • నో మాస్క్నో ఎంట్రీ పేరిట కార్యక్రమాలు
  • 7న క్యాండిల్ ర్యాలీ

 రాష్ట్రంలో మళ్లీ కరోనావిజృంభిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనేక విద్యాసంస్థలు కరోనా హాట్ స్పాట్లుగా మారా యి. గడిచిన వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా విద్యాసంస్థలలోనే బయ టపడటం ఆందోళన కలిగిస్తోంది. తిరుమల వేదపాఠశాలలో 57 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటన మరువక ముందే తాజాగా రాజ మహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో163 మందికి వైరస్ సోకడం ఆందోళన కలిగి స్తోంది. ఈ విద్యా సంస్థల్లో 700 మంది విద్యార్థు లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 163 మందికి కరోనా సోకినట్లుగానిర్ధారణైంది. అదే విధంగా శ్రీశైలం వేదపాఠశాలలో కూడా ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లుగా వెల్లడైంది. కాగా గడచిన 24 గంట ల్లో 492 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మూడు నెలలుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. కాగా మంగళవారం ఒక్క సారిగా కేసులు పెరిగిపోవడంతో ఆందోళన నెలకొంది. ప్రధానం చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనం తపురం, క ర్నూలు జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసు లుభారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలో అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థలతో పాటు రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల పై సమీక్షించారు కాంటాక్ట్,ట్రేసింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనా నియంత్రణపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కలిగించాలని నిర్ణయించారు

రేపటినుంచి విస్తృత ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు అంటే15 రోజుల పాటు కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలనిజిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరి అధికారులను భాగ స్వాములను చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలి గించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అదే విధం గా ఏప్రిల్ 7వ తేదీన అవగాహన కార్యక్రమాల ముగింపు సందర్భం గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో విధిగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పాల్గొనాలని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ మరింత ఉధృతం

మూడు లక్షల మంది లబ్దిదారులకు ప్రతి రోజు వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యాన్ని వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని సచివా లయాలతో పాటు 1,830 ప్రభుత్వ ఆసుపత్రులు, 634 ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో టీకా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. టీకా తీసుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిం చాలని అంబులెన్స్లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించే ప్రాంతాల్లో మైలు ద్వారా ప్రచారం చేపట్టాలని దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు బుగ్గన, ఆళ్ల నాని ఆదేశించారు

నో మాస్క్, నో ఎంట్రీ

రాష్ట్రంలో కరోనా మరోసారి కోరలు చాస్తున్న తరుణంలో ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, విద్యా సంస్థలు, మత సంస్థలు, సినిమా హాళ్లలో మాస్క్ ధరించడాన్ని త పృనిసరి చేయాలని ఆదేశించింది. నోమాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం ఎప్పు టికప్పుడు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ.. మా లు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా కోవిడ్ ప్రోటోకాల్ అమలు కావాలని నిర్దేశించారు. అదే విధంగా భౌతిక దూరం, శానిటైజర్ వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు

విద్యార్థులకు ప్రత్యేక చికిత్స - మంత్రి ఆళ్లనాని

రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ విద్యా సంస్థలో 163 మంది విద్యార్థులకు కరోనా సోకిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడటం జరిగిందని విద్యార్థులకు సరైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను అదే విద్యా సంస్థలోని గదుల్లో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన విద్యార్థులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలనిఆదేశించినట్లుగా మంత్రి వెల్లడించారు.

ఆరు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత

రాష్ట్రంలో కరో వైరస్ మహమ్మారి మళ్లి ముందస్తుండటం ప్రతి ఒక్కరోస్ ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరగటం వైరస్ వ్యాప్తి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిలిన 24గంటల్లో చికార్డుయిలో కొత్తకీసులు నమోదు కావడం శోచనీయం మూడు నెలల తర్వాత రికార్డు స్థాయి లో 12 మంది కేవిడ్ వాన పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల కరోనా పరీక్షలు నిర్వహించగా, వాటిలో కొత్త 492కేసులు వెలుగు చూశాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఒకే రోజు 168 కేసులు నమోదయ్యాయి, మరోవైపు కృష్ణా జిల్లాలో 47, రిత్తూరులో 56, విశాఖ జిల్లాలో 40 మందికి పోనా సినట్లుగా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి గాష్ట్ర వ్యాప్తంగా కోనిడినోకిన వారి సంఖ్యగి లక్షం 4 వేల 138 కి చేరింది. వీరిలో 8 విక్షం 8 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పటికీ డిశ్వర్డ్ అయి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గడిచిన ఆ గంటల్లో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ తీవ్రతతో మృతి చెంచారు. రాజుగా నమోదైన ఈ మరణాలతో కలిసి ఇప్పుడి వరకు కోపిడకు బలైన వారి సంఖ్య 1,1018 చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 256 మంది కోలుకుని ఉన్నార్డ్ అయ్యాడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరో 2616యాక్టివ్ కేసులు ఉన్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vaccination is further exacerbated"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0