Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

24 Hours Sun: There is no night..there is a place where the sun is visible even at midnight ..

 24 Hours Sun : అక్కడ రాత్రి అనేదే ఉండదు..అర్థరాత్రి కూడా సూర్యుడు కనిపించే ప్రాంతం ..

24 Hours Sun: There is no night..there is a place where the sun is visible even at midnight ..


24 Hours of Sun..Norway Sunset: రాత్రి, పగలు అనేది సర్వసాధారణంగా ఈ కాలచక్రంలో కొనసాగుతుంటుంది. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు కనిపిస్తుంటారు. కానీ రాత్రి అనేదే లేని ఓ ప్రాంతం కూడా ఉంది. అక్కడ ఎప్పుడూ పగలే ఉంటుంది. అంటే రాత్రి అయినా చీకటే ఉండదు. అంతా సూర్యుడు వెదజల్లే కిరణాల వెలుగే.అదేంటీ రాత్రి అంటున్నారు. రాత్రి సమయంలో సూర్యుడు ఎందుకుంటాడు చంద్రుడు కదా ఉంటాడు అనుకోవచ్చు. కానీ అదే ఈ అనంత విశ్వంలోని ఎన్నో వింతల్లోఅదికూడా ఒకటి.

ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు మరెన్నో విశేషాలకు ఆలవాలంగా విలసిల్లుతోంది.
ఒక్కో ప్రాంతంలో వింతలు..మరెన్నో విశేషాలు. భిన్నమైన వాతావరణం.విభిన్నమైన వైవిధ్యం, విశేషాలు ఉన్నాయి. అటువంటి ఓ వింత కలిగిన ప్రదేశం అది. అక్కడ రాత్రి అనేదే ఉండదు. అంతా పగలే.అర్థరాత్రి సమయం అయితే అవుతుందిగానీ సూర్యుడే కనిపిస్తాడు. చంద్రుడు కాదు. సూర్యుడే ఉంటాడంటే పగలే కదా..అంటే అక్కడ రోజుకు 24 గంటలూ సూర్యుడే కనిపిస్తాడు..! ఆ అరుదైన అద్భుతమైన ప్రదేశం నార్వే దేశంలో ఉంది..!!

సాధరణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం పగలు, మిగతాది రాత్రి ఉంటుంది. ఇలా పగలు, రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది. ఈ కాలచక్రంతోనే ఈ అనంత ప్రాణికోటి మనుగడ సాగిస్తోంది. కానీ..రోజులో కేవలం 40 నిమిషాలు మాత్రమే రాత్రి సమయం ఉండే ప్రదేశం ఈ భూమిపైనే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే..

నార్వే దేశంలో రాత్రి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సూర్యుడు రాత్రి 12.43 గంటలకు అస్తమిస్తాడు. మళ్లీ కేవలం 40 నిమిషాల తర్వాతే తిరిగి ఉదయిస్తాడు. ఇలాగైతే ఎలా అనే పెద్ద డౌట్ రానే వస్తుంది. కానీ సంవత్సరమంతా అలా ఉండదు. వేసవి సమయంలో దాదాపు రెండున్నర నెలలు ఈ దేశంలో వాతావరణం ఇలా వింతగానే ఉంటుంది.

అందుకే నార్వేను 'కంట్రీ ఆఫ్‌ మిడ్‌నైట్‌ సన్‌' అని పిలుస్తుంటారు. ఆర్కిటిక్‌ పరిధిలోకి వచ్చే నార్వేలో మే నుంచి జూలై మధ్యలో సుమారు 76 రోజుల పాటు సూర్యుడు ఇలా ఎక్కువసేపు ఉంటాడు. ఇదే దేశంలోని మరో నగరంలోని ప్రజలు గత వందేళ్లుగా సూర్యుడిని చూడట్లేదట. దీనికి మరో వింత అయితే కాదు. దీనికి కారణం ఆ నగరం చుట్టూ పర్వతాలే ఉంటాయి. నగరాన్ని పర్వతాలతో దిగ్భంధం చేసినట్లుగా భలే వింతగా ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "24 Hours Sun: There is no night..there is a place where the sun is visible even at midnight .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0