Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another vaccine is coming in India .. one dose is enough ..!

 భారత్ లో మరో వ్యాక్సిన్ వస్తోంది .. ఒక్క డోస్ చాలు .. !

Another vaccine is coming in India .. one dose is enough ..!

భారత్‌లో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. ఈ రెండు వ్యాక్సిన్లు.. రెండు డోసులుగా తీసుకోవాలి.. అయితే, త్వరలోనే మూడో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ నివారణకు వ్యాక్సిన్‌ను రూపొందించిన అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్.. ఎమర్జెన్సీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల కంటే సమర్థంగా ఈ వ్యాక్సిన్ పనిచేయనున్నట్టు తెలిపింది. పైగా.. ఈ కరోనా వ్యాక్సిన్‌.. సింగిల్‌ డోస్ టీకా కావడం విశేషం.

భారత్‌లో బయోలాజికల్‌ ఈ తో కలిసి ఈ కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.

ఈ వ్యాక్సిన్‌ తయారీలో మాస్‌ ప్రొడ్యూసర్‌గా ఉంది బయోలాజికల్‌ ఈ. ఇప్పటికే ఫేస్‌ వన్‌, ఫేస్‌ టు ట్రయల్స్‌ నిర్వహిస్తున్న బయోలాజిక్‌ ఈ.. త్వరలోనే మూడో దశ ట్రయల్స్‌ కోసం డీసీజీఐ నుంచి అనుమతులు కోరనుంది. తదుపరి ట్రయల్స్‌ కూడా సక్సెస్‌ అయితే..

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లన్నీ.. రెండు డోసుల టీకాలే. వాటిని తీసుకున్నాక..

28 రోజుల వ్యవధిలో రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, కొన్ని ఫార్మా సంస్థలు సింగిల్ డోస్‌ వ్యాక్సిన్‌పై కొంతకాలంగా.. పరిశోధనలు చేస్తున్నాయి. అందులో జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న టీకాపై అంచనాలు ఏర్పడగా...

తాజాగా ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఫార్మా మేజర్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌.. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ తో కలిసి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా తర్వలోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ టీకా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ వ్యాక్సిన్ 91.6 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ట్రయల్స్ డేటా ప్రస్తుతం ఇండియన్ రెగ్యులేటర్ దగ్గరుండగా.. రాబోయే కొద్ది వారాల్లోనే దీనికి కూడా ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another vaccine is coming in India .. one dose is enough ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0