Caronaa
6,096 మందికి పాజిటివ్
రాష్ట్రంలో ఒక్కరోజే 20 మరణాలు
మలిదశలో తీవ్రంగా వైరస్ వ్యాప్తి
చిత్తూరు జిల్లాలో మరింత ఎక్కువ
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మరింత పెరిగాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున రోజురోజుకి అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 35,962 నమూనాలను పరీక్షించగా ఏకంగా 6,096 (16.95%) కేసులు బయటపడ్డాయి.
20 మంది మృతి చెందారు. గత ఏడాది అక్టోబరు 4వ తేదీ తర్వాత కేసులు, అక్టోబరు 25 తర్వాత మరణాలు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లాలో 1,024 కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లాలో అయిదుగురు, కృష్ణా-3, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ఈనెలలో ఇప్పటివరకు మొత్తమ్మీద చిత్తూరు జిల్లాలో 8,231 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 7,041, విశాఖపట్నం-5,218, కృష్ణా-3,839, శ్రీకాకుళం-3,493, కర్నూలు-3,302, నెల్లూరు-3,261, తూర్పుగోదావరి-2,970, ప్రకాశం-2,528, అనంతపురం-2,306, కడప-2,092, విజయనగరం-1,536, పశ్చిమగోదావరి జిల్లాలో 425 చొప్పున కేసులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 5,22,984 నమూనాలు పరీక్షించగా 46,242 (8.84%) కేసులు బయటపడ్డాయి. 157 (0.33%)మంది ప్రాణాలు విడిచారు.
మొత్తం కేసులు 9,48,231
రాష్ట్రంలో మొత్తమ్మీద 1,56,06,163 నమూనాలు పరీక్షించారు. 9,48,231 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2,194 మంది కోలుకున్నారు. 35,592 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,05,266 మంది రికవరీ అయ్యారు. 7,373 మంది మరణించారు.
సచివాలయంలో నమూనాల సేకరణ
సచివాలయంలో 200 మంది ఉద్యోగుల నుంచి పరీక్షలు చేయడానికి నమూనాలు సేకరించారు. ప్రతి శుక్రవారం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తాజాగా ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు.
శ్రీశైలంలో మధ్యాహ్నం వరకే దుకాణాల నిర్వహణ
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి దుకాణాలను మూసివేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఈ చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకే దుకాణాలు నిర్వహించాలని నిర్వాహకులకు తెలిపారు.
0 Response to "Caronaa "
Post a Comment