Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Alert! Explanation of how oxygen levels can be increased by sleeping method.

కరోనా అలర్ట్ ! పడుకునే పద్ధతి ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు ఎలాగో వివరణ.

Corona Alert!  Explanation of how oxygen levels can be increased by sleeping method.

 Proning Process : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్కా పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బెడ్స్ దొరికినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటువంటి సమయంలో చాలామంది కరోనా లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అటువంటి వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోనింగ్ అనే ప్రక్రియ ద్వారా శ్వాసతో పాటు ఆక్సిజన్​ లెవల్స్​ పెంచుకోవచ్చు. ఛాతి, పొట్ట భాగంపై బరువు పడే విధంగా బోర్లా పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకుని శ్వాస తీసుకోవడం వల్ల లంగ్స్​కు పూర్తి స్థాయిలో ఆక్సిజన్​ అందుతుందని నిపుణులు సూచించారు.

ప్రోనింగ్​ సిస్టం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్లకు ఇదొక వరం లాంటిది.

విధానం

1. మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.
2. ఒక మెత్తడి పిల్లో తీసుకుని మెడ కింద భాగంలో ఉంచుకోవాలి.
3. ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు పిల్లోలను ఉంచుకోవచ్చు.
4. మరో రెండు పిల్లోలను మోకాలి కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి.
5. ఎక్కువ సమయం బెడ్​పైనే ఉండే పేపెంట్లకు రోజంతా ఒకే విధానంలో పడుకునే ఇబ్బంది లేకుండా వివిధ భంగిమల్లో రెస్ట్​ తీసుకోవచ్చు. ఒక్కో భంగిమలో 30నిమిషాల నుంచి 2గంటలకు వరకు పడుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

జాగ్రత్తలేం తీసుకోవాలి.
1. భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్​ చేయవద్దు.
2. తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకే ప్రోనింగ్​ చేయండి
3. పలు సమయాల్లో రోజులో ఎక్కువలో ఎక్కువ 16గంటల వరకు ఇలా పడుకోవచ్చు.
4. గుండె సంబంధిత రోగుల, గర్భిణులు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్​ విధానానికి దూరంగా ఉండాలి.

లాభాలు

1. ప్రోనింగ్​ పొజిషన్​ వల్ల శ్వాసమార్గం క్లియరై.. గాలి ప్రసరణ మెరుగవుతుంది.
2. ఆక్సిజన్ లెవల్స్​ 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్​అవసరం ఎక్కువ పడుతుంది.
3.ఐసోలేషన్​లో ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్​, ఆక్సిజన్​ లెవల్స్​, సుగర్​ లెవల్స్​ను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
4. మంచి వెంటిలేషన్​, సకాలంలో ప్రోనింగ్​ చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు.
అయితే ప్రోనింగ్​ గురించి డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. మీ శరీరం ప్రోనింగ్​కు సహకరిస్తుందా? లేదా? అన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Alert! Explanation of how oxygen levels can be increased by sleeping method."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0