Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Recruitment-2021: Apply for 5454 Junior Associates Posts (Customer Support & Sales)

 SBI లో  క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం. వివరాలు

Start of applications for 5000 clerk posts in SBI.  Details

బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 5454 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 275 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 దరఖాస్తులకు చివరి తేది. 

అభ్యర్థులు ఏదైనా ఒక స్టేట్‌ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం పోస్టులు: 5454

అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ అని రెండు విభాగాలుగా ఉంటుంది.

పరీక్ష విధానం

ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 70 మార్కులు ఉంటాయి. మూడు విభాగాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం గంట సేపట్లో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
మెయిన్‌.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్‌ లేదా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: 27.04.2021
దరఖాస్తులకు చివరితేదీ: 17.05.2021
ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ లో
మెయిన్‌ ఎగ్జామ్‌: 31.07.2021
వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/careers

APPLY HERE


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Recruitment-2021: Apply for 5454 Junior Associates Posts (Customer Support & Sales)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0