Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you take your children the same way? So the fine is mandatory under the new Motor Vehicle Act.

 మీరు కూడా మీ పిల్లలను ఇలాగే తీసుకెళతారా? ఐతే ఫైన్ తప్పదు మోటారు వాహన కొత్త చట్టం ప్రకారం.

Do you take your children the same way?  So the fine is mandatory under the new Motor Vehicle Act.


మోటార్ సైకిల్ యాక్ట్ ప్రకారం 16 ఏళ్ళు మరియు 18 ఏళ్ళు పిల్లలు కూడా ద్విచక్ర వాహనాన్ని నడపచ్చు కానీ కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. పిల్లలు వయస్సు 4 ఏళ్లు దాటితే ట్రిపుల్ రైడ్ అవుతుంది. పిల్లల్ని మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి పోతూ ఉంటారు. అయితే కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నాలుగు ఏళ్ళు దాటిన పిల్లలు ఉంటే అది ట్రిపుల్ రైడ్ అవుతుంది.

అంటే ఇద్దరు వ్యక్తుల తో పాటు నాలుగు ఏళ్ళు దాటిన పిల్లవాడు ఉంటే అది ట్రిపుల్ రైడ్ కింద అవుతుంది. అదే ఒకవేళ ఒకరే వెళ్తూ నాలుగేళ్ల దాటినా పిల్లవాడిని ఎక్కించుకుంటే పిల్లలకి కూడా హెల్మెట్ వేయాలి. ఒకవేళ లేదు 194 ఎ సెక్షన్ ప్రకారం వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది.

16 మరియు 18 ఏళ్ల పిల్లలు ద్విచక్ర వాహనాన్ని నడపచ్చు:

రెండు లెవెల్స్ లో లైసెన్స్ని ఇస్తున్నారు. మొదటి లెవెల్ ఏంటంటే 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వాళ్ళకి ఒక లైసెన్స్ మరియు 18 ఏళ్లు దాటిన వాళ్లకి మరొక లైసెన్స్. ఇలా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు ఉన్న వాళ్లు కూడా బండి నడపవచ్చు. అయితే గేర్ లేని ద్విచక్ర వాహనాన్ని మాత్రమే నడపాలి గుర్తుపెట్టుకోండి. అలానే ఆ వాహనం మాక్సిమం 50cc మాత్రమే ఉండాలి. అదే రెండు లెవెల్ వాళ్లకు ఎటువంటి పరిమితి లేదు.

హార్న్ కొడితే ఫైన్:

సైలెంట్ జోన్ లో ఉన్నప్పుడు హార్న్ కొట్టకూడదు. అలానే సైలెంట్ జోన్ లో ఉన్నప్పుడు బండి ఆపి ఫోన్ మాట్లాడితే కూడా జరిమానా పడుతుంది గుర్తుంచుకోండి. సైలెంట్ జోన్ లో ఉన్నప్పుడు హార్న్ కొడితే వేయి రూపాయలు కట్టాల్సి ఉంటుంది.

కొత్త రూల్ ప్రకారం పెనాల్టీ వివరాలు:

  • రెడ్ లైట్ దాటితే 500 రూపాయలు కట్టాలి.
  • లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఐదువేల రూపాయలు కట్టాలి.
  • అతివేగం లో వెళ్తే వెయ్యి రూపాయలు కట్టాలి.
  • స్టంట్ చేస్తే ఐదు వేలు కట్టాలి.
  • రేసింగ్ చేసే 5,000 కట్టాలి.
  • ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రెండు వేల రూపాయలు కట్టాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you take your children the same way? So the fine is mandatory under the new Motor Vehicle Act."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0