Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights from the video conference of Dr. Adimulapu Suresh Gari, Minister of State for Education, on the conduct of intermediate examinations

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ గురించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి వీడియో కాన్ఫిరెన్సు లోని ముఖ్యాంశాలు.

Highlights from the video conference of Dr. Adimulapu Suresh Gari, Minister of State for Education, on the conduct of intermediate examinations

  • ఇన్విజిలేటర్లు అందరికీ వాక్సిన్.
  • పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలపై వేగంగా చర్యలు.
  • రవాణా సౌకర్యం పై ద్రుష్టి పెట్టండి.

 ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్ లు అందరికీ వాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి అధికారులతో మాట్లాడారు. ఈ కాన్ఫెరెన్స్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ, అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లు, ఎస్ పి లు, జిల్లా వైద్య శాఖధికారులు, ఆర్ ఐ ఓ లు, మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.మంత్రి సురేష్ మాట్లాడుతూ...


  • పరీక్షలు నిర్వహణలో అధికారులంతా ఎవరి వంతు వారు బాధ్యతగా పనిచేయండి.
  • ఇన్విజిలేటర్ లు అందరికీ వాక్సిన్ వేసెందుకు చర్యలు ప్రారంభించాం.
  • దాదాపు 28 వేల మందికి వాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు.
  • ప్రభుత్వం చేపట్టిన వాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొందరు వాక్సిన్ వేయించుకొని ఉన్నారు.
  • మిగిలిన వారందరికీ వాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నాం.
  • పరీక్షా కేంద్రాల్లో ధర్మల్ స్కానర్లు, మాస్క్ లు ఏర్పాటు చేసెందుకు అవసరమైన ఏర్పాట్లు తక్షణమే జిల్లా వైద్య శాఖధికారులు పూర్తి చేయండి.
  • ప్రతి కేంద్రంలో ఒక ఐసొలేషన్ గదిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
  • కనీసం ప్రతిచోట 5 పిపిఇ కిట్లు అందుబాటులో ఉంచాలి.
  • మనం చేసే ఏర్పాట్లు తో పిల్లల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడాలి.
  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు పై ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు.
  • పరీక్షా కేంద్రాలకు చేరేందుకు అవసరమైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి.
  • ఆర్ ఐ ఓ లు, ఆర్టీసీ అధికారులకు రూట్ మ్యాప్ ఇచ్చి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే డ్యూటీలో పోలీసుల సంఖ్య పెంచాలని సూచించారు.
  • విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు పూర్తి చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights from the video conference of Dr. Adimulapu Suresh Gari, Minister of State for Education, on the conduct of intermediate examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0