Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Notification for replacement of 459 posts

 459 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

Notification for replacement of 459 posts

ఇతర వివరాలు: అంతర్జాతీయ సరిహద్దుల్లో హైవేలను నిర్మించే బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 459 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో డ్రాట్స్‌మ్యాన్‌, స్టోర్‌ సూపర్‌వైజర్‌, రేడియో మెకానిక్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు పురుషులకు మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రేడ్‌టెస్ట్‌, రాతపరీక్ష అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 459

ఇందులో డ్రాట్స్‌మ్యాన్‌ 43, సూపర్‌వైజర్‌ స్టోర్‌ 11, రేడియో మెకానిక్‌ 4, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 1, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ 250, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ 150 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పాసై ఉండాలి. స్టోర్‌ సూపర్‌ వైజర్‌ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి. ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్‌ పాసై ల్యాబ్‌ అసిస్టెంట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. రేడియో మెకానిక్‌, మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌ లో సర్టిఫికెట్‌ ఉండాలి. మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ పోస్టుకు అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌, ప్రాక్టికల్‌ (ట్రేడ్‌) టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.

అడ్రస్‌: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune - 411

అప్లికేషన్‌ ఫీజు: రూ.50, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ:  10.06.2021

వెబ్‌సైట్‌: bro.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Notification for replacement of 459 posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0