Impact of new zonal system on teacher promotions and transfers !?
టీచర్ల ప్రమోషన్లు, బదిలీలపై కొత్త జోనల్ వ్యవస్థ ప్రభావం!?
రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ప్రతిపాదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రపోజల్ ని కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు నిన్న గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు కేంద్రం విడుదల చేసిన గెజిట్లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లను ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. అదే సమయంలో కొత్త జోనల్ సిస్టం అమల్లోకి వచ్చిన కారణంగా ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సమస్య ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఉంటుంది. అయితే, మిగతా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇటీవలే ప్రమోషన్లు ఇచ్చారు. మరో మూడేళ్ళ రిటైర్మెంట్స్ ఉండవ్ కాబట్టి, ప్రమోషన్లు కూడా దాదాపు ఉండవ్. కానీ, ఒక్క విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం గత ఆరేళ్లుగా ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నయ్. టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం కెసిఆర్ ఇటీవల అసెంబ్లీలో విష్పష్టంగా ప్రకటించడంతో ఈ వేసవి సెలవుల్లో ప్రమోషన్ల కల సాకారమవుతుందని ఉపాధ్యాయులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా కొత్త జోనల్ సిస్టం అమల్లోకి రావడంతో.... ప్రమోషన్లు ఆలస్యమవుతాయని ఆందోళన కలుగుతోంది. కొత్త జోనల్ సిస్టం ఉనికిలోకి వచ్చినందున ప్రభుత్వం ముందుగా చేయాల్సిన పనులు చాలా ఉంటయ్.
క్యాడర్ రీఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. సెకండరీ గ్రేడ్ టీచర్.... దాని ఈక్వల్ క్యాడర్ పోస్టులను జిల్లా క్యాడర్ గా చేస్తారు. ఈ విషయంలో సందిగ్థత లేదు.
స్కూల్ అసిస్టెంట్... దాని ఈక్వల్ క్యాడర్ పోస్టులను జిల్లా క్యాడర్లోనే కొనసాగిస్తారా? లేక జోనల్ క్యాడరుగా మార్చుతారా? తేలాల్సి ఉంది. ఎందుకంటే, గతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టుల జోనల్ క్యాడర్ గానే ఉండే! ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
GHM Gr-II పోస్టులు ప్రస్తుతం పేరుకు జోనల్ క్యాడరే అయినా..... బదిలీలు, ప్రమోషన్లు మాత్రం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతున్నయ్. కొత్త జోనల్ సిస్టం ప్రకారం కూడా GHM Gr II పోస్టులు జోనల్ క్యాడర్లోనే ఉండవచ్చు. అయితే, మిగతా కొన్ని శాఖల్లో ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా ప్రతిపాదించారు. విద్యాశాఖలో గెజిటెడ్ హెచ్ఎం పోస్టులను ఏ క్యాడర్ చేస్తారో చూడాలి. ఇవన్నీ అయ్యాకే ప్రమోషన్లు కల్పిస్తామంటే మాత్రం తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా TSSS Rule 10 (a ) ప్రకారం అడహాక్ ప్రమోషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తారా? స్పష్టం కావాల్సి ఉంది. అయితే, రూల్ 10 (a ) ప్రకారం అడహాక్ ప్రమోషన్లకు లీగల్ గా వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమిస్తారో చూడాలి. మొత్తానికి టీచర్ల ప్రమోషన్లు ఆలస్యమవుతాయని ఆందోళన మాత్రం కలుగుతోంది.
0 Response to "Impact of new zonal system on teacher promotions and transfers !?"
Post a Comment