Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The following precautions can be taken to prevent debit card fraud

 డెబిట్ కార్డు మోసాలను నివారించడానికి ఈ క్రింది జాగ్రత్తలను పాటిస్తే మోసాలు జరగకుండా నివరించవచ్చు SBI

The following precautions can be taken to prevent debit card fraud

దేశ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు డబ్బును సురక్షితంగా ఉంచే మార్గాలపై కొన్ని సలహాలను అందించింది. ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు మోసాలను నివారించడానికి వినియోగదారులు ఏటీఎం లావాదేవీలను పూర్తి గోప్యతతో నిర్వహించాలని ఎస్‌బీఐ సూచించింది. మీ ఎటిఎం కార్డ్ , పిన్ ముఖ్యమైనవి. మీ డబ్బును సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు పాటించాలని ట్టిట్టర్ ద్వారా వెల్లడించింది.

ఎటిఎంలలో సురక్షిత బ్యాంకింగ్ గురించి ఎస్‌బీఐ కొన్ని సూచనలు.

  • 1)ఏటీఎం లేదా పీఓఎస్‌ మెషీన్ వద్ద కార్డును ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్‌ను చేతితో మూసేయండి.
  • 2)మీ పిన్ / కార్డ్ వివరాలను ఎప్పుడూ, ఎవరితో పంచుకోవద్దు
  • 3)మీ కార్డులో ఎప్పుడూ పిన్ రాయకండి.
  • 4)మీ కార్డు వివరాలు లేదా పిన్ అడుగుతున్న సందేశాలు, ఇ-మెయిల్స్‌ లేదా కాల్స్‌కు స్పందించవద్దు.
  • 5)మీ పుట్టినరోజు, ఫోన్ లేదా ఖాతా నంబర్‌ను మీ పిన్‌గా నంబర్‌గా పెట్టుకోవద్దు.
  • 6)లావాదేవీ రశీదును పారవేయండి లేదా సురక్షితంగా ఉంచండి.
  • 7)లావాదేవీని ప్రారంభించడానికి ముందు సీసీ కెమెరాలను పరిశీలించండి.
  • 8)ఏటీఎం లేదా పీఓఎస్‌ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్ మానిప్యులేషన్, హీట్ మ్యాపింగ్ గురించి జాగ్రత్త వహించండి.
  • 9)మీ వెనుక నిలబడి ఇతరులు పిన్ చూసే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
  • 10)లావాదేవీ హెచ్చరికల కోసం ఎస్‌బీఐ ఖాతాలోకి సైన్ అప్ చేయండి.
  • బ్యాంకు ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రారంభించింది, ఎస్‌బీఐ ఏటీఎంలలో లావాదేవీలు మరింత సురక్షితం. 
  • జనవరి 1, 2020 న ప్రవేశపెట్టిన ఈ కొత్త సౌకర్యం, ఏటీఎం కార్డుదారులకు వన్-టైమ్ పాస్‌వర్డ్‌ (ఓటిపి) సహాయంతో నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 
  • అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో గతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రూ.10,000 కన్నా ఎక్కువ విత్‌డ్రాయల్స్‌కు ఈ అదనపు సెక్యూరిటీ ఫీచర్ ఉండేది. 
  • కానీ ప్రస్తుతం 24 గంటలు ఈ విధానాన్ని అమలు చేస్తోంది ఎస్‌బీఐ.. ఓటీపీ 
  • ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ లావాదేవీలను మరింత సురక్షితంగా చేస్తుంది. 
  • మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం ఎల్లప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యత అని బ్యాంకు పేర్కొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The following precautions can be taken to prevent debit card fraud"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0