Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation of applications for admission in model schools

మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Invitation of applications for admission in model schools

 రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలల్లో) ఆరో తరగతిలో ప్రవే శాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు మోడల్ స్కూళ్ల సొసైటీ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో విద్యా ర్డులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని, ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉండే ఈ స్కూళ్లలో ఎటువంటి ఫీజు వసూలు చేయరని చెప్పారు.

మోడల్ స్కూళ్లలో ప్రవేశ అర్హతలు.

వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2007 నుంచి 31-08 2011 మధ్య పుట్టి ఉండాలి.

సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి.

 2020-21 విద్యా సంవత్స రంలో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయడానికి ముందుగా seap.gov.in/ apms. ap.gov. in వెబ్సైట్ సందర్శించాలి. అభ్యర్థులు ఏప్రిల్ 16 నుండి మే 15 లోగా గేట్ వే ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించాలి. తరువాత వారికి ఒక జన రల్ నెంబరు కేటాయిస్తారు. ఆ నెంబరు ఆధా రంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో WWW. cse.ap.gov.in/ apms ap gov. in వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేయా లి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. లాటరీ విధానంలో విద్యార్థు లను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్ని లేదా జిల్లా విద్యా శాఖాధికారి మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation of applications for admission in model schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0