Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One in every five people tested is infected with the virus

పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

One in every five people tested is infected with the virus

  • దేశంలో పాజిటివిటీ రేటు 20%
  • ఒక్కరోజులో కొత్తగా 3.46 లక్షల మందికి కరోనా
  • గంటకు 109 మంది చొప్పున 2,624 మంది మృతి 

కొవిడ్‌ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు స్పష్టమవుతోంది. దీంతో పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా తేలింది. మార్చి 24న ఇది 5 శాతమే. నెల రోజుల వ్యవధిలోనే వైరస్‌ సంక్రమణ నాలుగు రెట్లు పెరిగింది. పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివిటీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 17,53,569 మందికి పరీక్షలు చేయగా అందులో 3,46,786 మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ నెలలో నిర్వహించిన మొత్తం పరీక్షల ప్రకారం గత 24 రోజుల్లో సగటున 13.70% పాజిటివిటీ రేటు నమోదైంది. ఇది తొలి వారంలో 8.36%, రెండో వారంలో 11.67%, మూడో వారంలో 16.69 శాతానికి పెరిగింది. గత మూడు రోజుల్లో సగటున 19.32% మంది ఫలితాలు పాజిటివ్‌గా తేలాయి. గంటకు 109 మంది చొప్పున గత 24 గంటల్లో 2,624 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జోబత్‌ ఎమ్మెల్యే కళావతి భూరియా(49) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.

ఆరోగ్య సంక్షోభం ఆందోళనకరం: ఐఎంఎఫ్‌

‘‘దేశంలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితుల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో కనిపిస్తున్న ఆరోగ్య సంక్షోభ విస్ఫోటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఎంతోమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు కరోనా ఉద్ధృతికి అల్లాడిపోతున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కుల వాడకం వంటి జాగ్రత్తల్ని పాటించాలి. ఔషధాలు, టీకాల సరఫరా యుద్ధప్రాతిపదికన పెంచాలి’’ అని పేర్కొన్నారు.

నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు

వైరస్‌ సంక్రమణ వేగం పెరగడంతో దేశంలో వరుసగా మూడో రోజూ 3 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. నాలుగో రోజూ 2వేలకు పైగా మరణాలు సంభవించాయి. 15 రాష్ట్రాల్లో ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో కొత్త కేసులొచ్చాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 44.58 లక్షల కేసులు, 26,986 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం క్రియాశీల కేసులు 25.52 లక్షలకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 18న నమోదైన 10.17లక్షలతో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు అధికం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One in every five people tested is infected with the virus"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0