Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Only Girls Village

 Only Girls Village  ఆడపిల్లలు మాత్రమే పుట్టే గ్రామం 10 ఏళ్లుగా ఒక్క మగపిల్లాడు పుట్టలేదు.

Only Girls Village

Only Girls Village Miejsce odrzanskle :అమ్మకడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు..పుట్టినా చంపేస్తు దారుణాల గురించి ఎన్నో విన్నాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం అవతోంది. కానీ ఓ గ్రామంలో కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు. అస్సలు మగపిల్లాడే పుట్టటంలేదు. దీంతో గ్రామం నిండా ఆడపిల్లలకే కనిపిస్తారు. అటువంటి విచిత్రమైన గ్రామం గురించి వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

10 సంవత్సరాల పాటు అంటే దశాబ్దం పాటు ఆ గ్రామంలో ఆడపిల్లలు తప్ప ఒక్క మగపిల్లాడు కూడా పుట్టకపోవటం విశేషం.

దీంతో స్థానిక ప్రభుత్వం ఆ గ్రామంలో మగపిల్లాడు పుడితే ఆ తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని ప్రకటించింది. దశాబ్దం కాలం పాటు కేవలం అమ్మాయిలు మాత్రమే పుట్టిన విచిత్రమైన పరిస్థితి ఆ గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..

అది పోలాండ్. చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని గ్రామం. పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ. 10 ఏళ్లుగా ఆడపిల్లలు మాత్రమే పుట్టిన గ్రామం. అక్కడ ఆడపిల్లలు మాత్రమే జన్మించారు..ఇప్పటికే ఆడపిల్లలే పుడుతున్నారు. దీంతో ఈ గ్రామం గురించి పెద్ద చర్చనీయాంశమైంది. మగపిల్లాడు పుడితే..ఆ తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని స్థానిక మేయర్ ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

10 ఏళ్ల తరువాత పుట్టిన ఒకే ఒక్క మగపిల్లాడు..
మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు. సుమారు 10 సంవత్సరాల క్రితం ఒక మగపిల్లాడు జన్మించాడు ఈ గ్రామంలో. కానీ ఆ మగపిల్లాడు పుట్టిన కొంతకాలానికే ఆ కుటుంబం మొత్తం గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఈ వింత గ్రామంలో జనాభా సుమారు 300లు. వీరిలో మగవారి సంఖ్య చాలా చాలా తక్కువ. ప్రతి కుటుంబంలో ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే పుడుతుండటంతో గ్రామంలో మగవారి సంఖ్య తగ్గిపోతోంది.

ఇక్కడ మగపిల్లల పుట్టుక చాలా అరుదు. దీంతో మగపిల్లాడు పుడితే ఆ తల్లిదండ్రులకు ఇంటికి బహుమతి ఇస్తామని మేయర్ ప్రకటించారు. ఈక్రమంలో ఎట్టకేలకు గత సంవత్సరం అంటే 2020లో ఓ మగపిల్లాడు పుట్టాడు. అంతే ఆ కుటుంబమే కాదు మొత్తం గ్రామం అంతా పండుగ చేసుకుంది. వారి ఆనందాలు అంబరాన్ని అంటాయి. ఆ బిడ్డకు జన్మనిచ్చిన దంపతులను పెద్ద సెలబ్రిటీలుగా చూస్తున్నారు. అలాని ఆడపుల్లలు పుట్టిన తల్లిదండ్రులు మాత్రం తమ ఆడపిల్లల్ని చూసి ఏమాత్రం బాధపడరు. ఆడపిల్లలను తక్కువగానూ చూడరు.

అంతుచిక్కని మిస్టరీగా మారిన ఆడపిల్లల గ్రామం..
మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ గ్రామంలోని పరిస్థితి ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది . అందరి మనసులో ఉన్న ఒకే ఒఖ్క ప్రశ్న. ఈ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే ఎందుకు పుడుతున్నారు? మగపిల్లలు ఎందుకు పుట్టటంలేదు అని..ఈ మిస్టరీని ఛేదించటానికి చాలా ప్రయత్నాలు జరిగాయట. కానీ పెద్దగా ఫలితాలేవీ రాలేదని చెబుతున్నారు. ఈ విచిత్ర విలేజ్ వెనుక మిస్టరీని మాత్రం కనుగొనలేకపోయారు. దీనిపై పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. కొనసాగుతునే ఉన్నాయి. మరి ఎప్పటికి తేలేనో..కాగా..ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మేథావులు సైతం ఛేదించలేని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఈనాటికీ ఆయా మిస్టరీలపై పరిశోధనలకు జరుగుతునే ఉన్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Only Girls Village"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0