WHO: Stop selling them… otherwise more risk .. World Health Organization made key comments
World Health Organization: కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనానే కాకుండా రాబోయే రోగాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తోంది. కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆహార మార్కెట్లో బతికి ఉన్న అడవి జంతువుల అమ్మకాలను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. పెద్ద సంఖ్యలో జనాభా సాంప్రదాయ మార్కెట్లో జీవనోపాధి అందిస్తాయని, వీళ్లతోపాటు సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి వాటి అమ్మకాన్ని నిలిపివేయడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
అసలు ఈ కరోనా మహమ్మారి కూడా అలాంటి మార్కెట్ నుంచే వచ్చిన విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో గుర్తు చేసింది.
అత్యవసరంగా భావించి వెంటనే అడవి జంతువుల అమ్మకాలను మార్కెట్లో నిలిపివేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. అయితే జంతవులు, అందులోనూ వన్యప్రాణుల వల్లే 70 శాతానికిపైగా కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో తేల్చి చెప్పింది. వీటిలో చాలా వరకూ గతంలో ఎప్పుడూ ఊచడని వైరస్‌లే ఉంటున్నాయని కూడా తెలిపింది. ఇలాంటి అడవి జంతువులను అమ్మే మార్కెట్‌ను మూసివేస్త బాగుటుందని డబ్ల్యూహెచ్‌వో ఆయా దేశాల ప్రభుత్వాలను కోరింది.
ఇప్పటికే కరోనాతో ఏడాదికిపైగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వచ్చే కొత్త రోగాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఇప్పటికే కరోనాతో ప్రపంచ దేశాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. అంతుచిక్కని వైరస్ వల్ల కోట్లాది మంది ప్రాణాలు పోతున్నాయి. అటు కరోనా.. ఇటు కొత్త రోగాల వల్ల మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
0 Response to "WHO: Stop selling them… otherwise more risk .. World Health Organization made key comments"
Post a Comment