Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Proning as an aid to help you breathe better during COVID19

‘ప్రోనింగ్‌’ ద్వారా ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోండి - కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు.

Proning as an aid to help you breathe better during COVID19

COVID 19 సమయంలో బాగా ఊపిరి పీల్చుకోవడంలో మీకు సహాయపడే ‘ప్రోనింగ్’

COVID-19: Proning for Self-Care

కోవిడ్ -19: స్వీయ సంరక్షణ కోసం ప్రోనింగ్

కరోనా వైరస్‌ రెండో విజృంభణతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ సోకిన వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాస సమస్యలను అధిగమించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా ‘ప్రోనింగ్‌’ (ప్రత్యేకమైన పొజిషన్‌లలో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతో పాటు ఆక్సిజన్‌ స్థాయులను మెరుగుపరచుకోవచ్చని చెబుతోంది. 

ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా బోర్లా పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ‘ప్రోనింగ్‌’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ‘ప్రోనింగ్‌’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. 

‘ప్రోనింగ్‌’ ద్వారా శ్వాస తీసుకునే విధానం

  • మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.
  • ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.
  • ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.
  • మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి.

  • ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు. ( PDF లోని చిత్రాల్లో చూడొచ్చు)

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

  • భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.
  • తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.
  • పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు. (వైద్యుల సూచనల మేరకు)
  • హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.

  • ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. 

ప్రయోజనాలు

  • ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.
  • ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.
  • ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
  • మంచి వెంటిలేషన్‌, సకాలంలో ‘ప్రోనింగ్‌’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.
  • ఇక సాధారణ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచేందుకు ప్రోనింగ్‌ సురక్షిత పద్ధతేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ప్రోనింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోనింగ్‌ గురించి మీ దగ్గరిలో ఉన్న వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీ శరీరం అందుకు సహకరిస్తుందా? లేదా? అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.


DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Proning as an aid to help you breathe better during COVID19"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0